Home
Mobile

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ శాంసంగ్‌ 5G ఫోన్‌పై రూ.10000 డిస్కౌంట్..!

శాంసంగ్‌ గత సంవత్సరం గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy A35 5G Smartphone) భారత్‌ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ అనేక బెస్ట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. 6.6 అంగుళాలు డిస్‌ప్లే, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు IP67 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. అయితే ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఏకంగా రూ.10000 ధర తగ్గింపు :
శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. విడుదల సమయంలో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30999 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33999 గా ఉంది.

samsung galaxy A35 5G smartphone

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా రూ.10000 తగ్గింపును పొందవచ్చు. అంటే 8GB/128GB స్టోరేజీ వేరియంట్ ను రూ.20999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB/256GB వేరియంట్‌ ను రూ.22999 కే సొంతం చేసుకోవచ్చు.

మూడు కలర్‌ వేరియంట్స్‌ :
దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ Awesome ఐస్‌ బ్లూ, Awesome లిలక్‌, Awesome నేవీ కలర్‌ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఫుల్‌ HD+ డిస్‌ప్లే :
శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో 6.6 అంగుళాలు ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను పొందుతుంది.

samsung galaxy A35 5G smartphone

ప్రాసెసర్‌, 5000mAh బ్యాటరీ :
ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు Exynos 1380 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 OS ను కలిగి ఉంది. గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం Mali G68 చిప్‌సెట్‌ను అమర్చారు. ఈ ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ట్రిపుల్ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను అమర్చారు. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. ముందువైపు 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఈ శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు Knox 3.1 రక్షణను కూడా కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
samsung galaxy A35 5G smartphone gets rs10000 discount on flipkart 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X