Home
Mobile

రూ.9 వేల డిస్కౌంట్‌.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ఇచ్చే 5G ఫోన్‌..!

శాంసంగ్‌ గత సంవత్సరం గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఏకంగా 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందవచ్చు. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ను భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

విడుదల సమయంలో శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy A35 5G) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.30999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A35 5G Smartphone

రూ.9 వేల డిస్కౌంట్‌ :
ఫ్లిప్‌కార్ట్‌లో 8GB/128GB వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. అదే 8GB/256GB వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. అంటే సుమారు రూ.9 వేలు, రూ.10 వేల డిస్కౌంట్‌ ను పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.6 అంగుళాలు FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ ను పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ Exynos 1380 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. Mali G68 కూడా అమర్చి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాతో అందుబాటులో ఉంది.

Take a Poll

IP67 రేటింగ్‌ :
శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ లను కలిగి ఉంది. మరియు IP67 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, WiFi 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు Knox 3.1 రక్షణను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌ Awesome ఐస్‌ బ్లూ, Awesome నేవీ కలర్‌, Awesome లిలక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A35 5G Smartphone now available with rs9000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X