ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 5 సంవత్సరాల అప్‌డేట్స్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ సహా..!
Samsung Galaxy A35 5G Smartphone : శాంసంగ్ నుంచి ఈ నెలలో గెలాక్సీ S26 సిరీస్, గెలాక్సీ A57, గెలాక్సీ A37 మోడల్స్, గెలాక్సీ F70 సిరీస్ మోడల్స్ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Galaxy Unpacked 2026)గెలాక్సీ S26 సిరీస్ విడుదల అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 25 న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్ ల వివరాలు.
రూ.18999 ప్రారంభ ధరకే :
భారత్ మార్కెట్ లో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.30999 ధరకు విడుదల కాగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.18999 ధరకు అందుబాటులో ఉంది. అదే విధంగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.33999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం రూ.20999 కు కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారుగా రూ.12 వేల తగ్గింపును పొందవచ్చు.

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ Exynos 1380 ప్రాసెసర్ ను కలిగి ఉంది. దీంతోపాటు Mali G68 ను కూడా అమర్చి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని శాంసంగ్ హామీ ఇచ్చింది.
ఫుల్ HD+ డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.6 అంగుళాలు FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ను పొందుతుంది. Awesome లిలక్, Awesome ఐస్ బ్లూ, Awesome నేవీ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
50MP OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5MP మ్యాక్రో లెన్స్, 13MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్ సెట్ 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP67 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








