Home
Mobile

శాంసంగ్‌ 5G ఫోన్‌ను రూ.11 వేల డిస్కౌంట్‌కు కొనుగోలు చేయవచ్చు.. 50MP కెమెరా, FHD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ..!

Samsung Galaxy A35 5G : శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ గత సంవత్సరం భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. మిడ్‌ రేంజ్‌ ఫోన్‌గా అందుబాటులోకి వచ్చిన ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ ను ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఈ ఫోన్‌ డిస్కౌంట్‌ ధరకు అందుబాటులోకి రాగా.. తాజాగా మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

Samsung Galaxy A35 5G

ఏకంగా రూ.11 వేల డిస్కౌంట్‌ :
శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.11 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు.

మూడు కలర్ వేరియంట్స్‌ :
అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33999 గా ఉండేది. ప్రస్తుతం రూ.21999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.12 వేల తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ Awesome ఐస్‌ బ్లూ, Awesome నేవీ కలర్‌, Awesome లిలక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ Exynos 1380 చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం Mali G68 కూడా కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు :
గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాలు ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్‌ 5G, 4G, WiFi 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు Knox 3.1 రక్షణను కూడా కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A35 5G with 50MP camera, 5000mAh battery gets rs11000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X