Home
Mobile

విడుదల అయిన కేవలం నెలరోజుల్లోనే రూ.2000 ధర తగ్గిన శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌.. 6 సంవత్సరాల అప్‌డేట్స్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ గత నెల తొలివారంలో గ్లోబల్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఇందులో గెలాక్సీ A26, గెలాక్సీ A36, గెలాక్సీ A56 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. గెలాక్సీ A56, A36 ఫోన్‌ సేల్‌ అప్పట్లోనే ప్రారంభం కాగా.. గెలాక్సీ A26 ఫోన్‌లు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. అయితే కేవలం నెల రోజుల్లోనే గెలాక్సీ A36 స్మార్ట్‌ఫోన్‌ ధరను శాంసంగ్ తగ్గించింది. ఈ ఫోన్‌ మిడ్‌ రేంజ్‌లో బెస్ట్‌ హ్యాండ్‌సెట్‌లుగా ఉన్నాయి. మరియు ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది.

శాంసంగ్‌ గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy A36 5G Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.32,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.38,999 గా ఉండేది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ధరను రూ.2000 చొప్పున శాంసంగ్‌ తగ్గించింది.

samsung galaxy A36 5G smartphone

శాంసంగ్‌ రూ.2000 తగ్గింపు అనంతరం ఈ ఫోన్‌ ధరలు వరుసగా రూ.30999, రూ.33999, రూ.36999 గా ఉన్నాయి. ఈ గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం Awesome వైట్‌, Awesome బ్లాక్‌, Awesome లావెండర్‌ వంటి మూడు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

CMF ఫోన్‌ 2 బ్యాక్‌ ప్యానల్‌ ఎలా ఉంటుందంటే.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, విడుదల వివరాలు..!

ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. అంటే ఏకంగా 6 సంవత్సరాల వరకు ఈ ఫోన్‌ను ఎటువంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు.

కెమెరా విభాగం పరంగా ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5MP మ్యాక్రో కెమెరాలతో అందుబాటులో ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్ 12MP కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌ సహా అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు 45W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్‌ IP67 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్‌ పోర్టు ఉంది.

Best Mobiles in India

English summary
samsung galaxy A36 5G smartphone price slashed by rs2000 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X