Samsung Galaxy A36 Vs Nothing Phone 3a Pro ఈ రెండు ఫోన్‌లతో ఏది బెస్ట్.. పూర్తి వివరాలు!
భారత్ మార్కెట్ లో ఇటీవల కాలంలో మిడ్ రేంజ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ లకు భారీ డిమాండ్ ఉంటోంది. ఎంట్రీ లెవల్, బడ్జెట్ రేంజ్ హ్యాండ్‌సెట్‌లను కూడా భారీగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో రూ.30 వేల ధరలో అనేక స్మార్ట్‌ఫోన్ లు లాంచ్ అయ్యాయి. ఇందులో శాంసంగ్ గెలాక్సీ A36, నథింగ్ ఫోన్ 3a ప్రో మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లు అనేక ప్రత్యేకతలను (Samsung Galaxy A36 Vs Nothing Phone 3a Pro) కలిగి ఉన్నాయి. అయితే ఈ రెండు ఫోన్లలో ఏది మీ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.
* శాంసంగ్ గెలాక్సీ A36 స్మార్ట్‌ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ A36 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ (2340*1080 పిక్సల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో భారత్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 7+ రక్షణను పొందుతుంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తోంది. అయితే శాంసంగ్ ఏకంగా 6 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను అందిస్తుందని తెలిపింది. మరియు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
ట్రిపుల్ కెమెరా యూనిట్ :
శాంసంగ్ మెరుగైన కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) సపోర్టును కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
ధర వివరాలు :
ఈ ఫోన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను అమర్చింది. ఈ హ్యాండ్‌సెట్ లావెండర్, బ్లాక్, వైట్, లైమ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.32,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.38,999 గా ఉంది.
* నథింగ్ ఫోన్ 3a ప్రో స్మార్ట్‌ఫోన్ :
నథింగ్ ఫోన్ 3a ప్రో స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 3a Pro Smartphone) 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ, 2160Hz PWM కలిగి ఉంది. Panda గ్లాస్ రక్షణను పొందుతుంది.
చిప్‌సెట్, OS వివరాలు :
నథింగ్ ఫోన్ 4nm ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 (Skin On Top) తో పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని నథింగ్ తెలిపింది.
కెమెరా వివరాలు :
ఫోన్ 3a ప్రో OIS, EIS, 2x జూమ్ సపోర్టుతో 50MP శాంసంగ్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 3X ఆప్టికల్ జూమ్, 60X డిజిటల్ జూమ్, 6X ఇన్ సెన్సార్ తో 50MP సోనీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు. మరియు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
బ్యాటరీ :
నథింగ్ ఫోన్ 3a ప్రో 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, గ్లిఫ్ టైమర్, వాల్యూమ్ ఇండికేటర్, గ్లిఫ్ కంపోజర్, గ్లిఫ్ టార్చ్, గ్లిఫ్ ప్రోగ్రస్ ఫీచర్‌లను కలిగి ఉంది.
ధర వివరాలు :
నథింగ్ ఫోన్ 3a ప్రో హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.29,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33,999 గా ఉంది. ఈ ఫోన్‌ను గ్రే, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఈ రెండు ఫోన్‌ల డిస్‌ప్లేలను చూసుకుంటే నథింగ్ ఫోన్ మెరుగైన బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అయితే నథింగ్ ఫోన్‌తో పోలిస్తే శాంసంగ్ ఫోన్ బెస్ట్ వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ రెండు ఫోన్‌ను 5000mAh బ్యాటరీతో పనిచేస్తున్నాయి. అయితే నథింగ్ ఫోన్ 50W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది.
ఈ రెండు ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తోనే పనిచేస్తున్నాయి. కెమెరా విభాగం పరంగా శాంసంగ్ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండగా.. నథింగ్ ఫోన్ మూడు 50MP కెమెరాలను కలిగి ఉంది. ఈ రెండు మోడల్స్‌లో బెస్ట్ కెమెరా ఫోన్ కావాలంటే నథింగ్ వైపు మొగ్గుచూపవచ్చు.
ధర విషయానికి వస్తే 8GB ర్యామ్ + 128GB వేరియంట్ శాంసంగ్ ఫోన్ ధర రూ.32,999 గా ఉంది. అదే నథింగ్ ఫోన్ రూ.29,999 కే అందుబాటులోకి వస్తోంది. శాంసంగ్ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తుండగా.. నథింగ్ ఫోన్ గరిష్ఠంగా 4 సంవత్సరాల వరకు మాత్రమే అప్‌డేట్స్ అందిస్తుంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. బెస్ట్ కెమెరా ఫోన్ మీకు కావాలంటే నథింగ్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చే ఫోన్ కావాలంటే శాంసంగ్ కొనుగోలు చేయండి. ఎందుకంటే ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








