షియోమికి పోటీగా 3కొత్త ఫోన్లను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసిన శాంసంగ్
మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ సరికొత్త వ్యూహాంతో ముందుకు దూసుకువస్తోంది.
మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ సరికొత్త వ్యూహాంతో ముందుకు దూసుకువస్తోంది. చైనా మొబైల్ మేకర్ షియోమి దెబ్బకు తన ర్యాంకును చేజార్చుకోవడంతో ఎలాగైనా సరే మార్కెట్లో టాప్ ప్లేసులో నిలవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గెలాక్సీ A సీరిస్‌తో మూడు స్మార్ట్‌ఫోన్లను ఈ రోజు ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది.Samsung Galaxy A50, Galaxy A30, Galaxy A10 పేర్లతో ఫోన్లను లాంచ్ చేసింది.కాగా ఇండియాలో Galaxy A50 మరియు Galaxy A30 యొక్క సేల్స్ మార్చ్ March 2 ను మొదలవుతుంటే Galaxy A10 యొక్క సేల్స్ March 20 నుంచి మొదలు కానున్నాయి .ధర ఫీచర్లను ఒకసారి పరిశిలిస్తే

Samsung Galaxy A50
4జీబీ ర్యామ్ +64జీబీ స్టోరేజ్ ధర రూ.19,990
6జీబీ ర్యామ్ +64జీబీ స్టోరేజ్ ధర రూ.22,990
ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9610 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 25, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy A30
ధర రూ.16,990
ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy A10
ధర రూ. 8,490
ఫీచర్లు
6.2 ఇంచుల డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








