Samsung Galaxy A50s:భారీ ధర తగ్గింపు

|

ఇండియాలో గెలాక్సీ A51 ను విడుదల చేసిన సందర్బంగా శామ్సంగ్ దీని ముందున్న గెలాక్సీ A50s స్మార్ట్‌ఫోన్ యొక్క ధరలను తగ్గించింది. నాలుగు నెలల క్రితం ఇండియాలో లాంచ్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ A50 మీద ధర తగ్గింపును పొందడం ఇది రెండవ సారి.

 గెలాక్సీ A50s

గెలాక్సీ A50s

20వేల లోపు స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా ఇష్టపడుతున్న వాటిలో ఇది కూడా ఉంది. గెలాక్సీ A50s ఇండియాలో 4GB మరియు 6GB ర్యామ్ వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధర తగ్గింపును పొందిన తరువాత ఇప్పుడు ఇది రూ.17,499 ధర వద్ద లభిస్తుంది.

 

 

 

ప్రేమికుల రోజు బహుమతిగా తక్కువ ధరలో గల స్మార్ట్ ఐటమ్స్ ఇవే!!!!ప్రేమికుల రోజు బహుమతిగా తక్కువ ధరలో గల స్మార్ట్ ఐటమ్స్ ఇవే!!!!

తగ్గింపు ధరల వివరాలు

తగ్గింపు ధరల వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ A50s ను 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. హ్యాండ్‌సెట్ యొక్క బేస్ వేరియంట్ ఇప్పుడు రూ.17,499 ధర వద్ద లభిస్తుంది. అయితే ప్రీమియం మోడల్‌ను రూ.19,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. కొత్త ధరలు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శామ్‌సంగ్ షాప్ ఆన్‌లైన్ మరియు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.

 

 

Samsung Galaxy 70s స్మార్ట్‌ఫోన్ ధర మీద భారీ తగ్గింపుSamsung Galaxy 70s స్మార్ట్‌ఫోన్ ధర మీద భారీ తగ్గింపు

లాంచ్ ధరలు

లాంచ్ ధరలు

ధర తగ్గింపుకు ముందు ఈ రెండు వేరియంట్ల యొక్క ధరలు వరుసగా రూ.19,999 మరియు రూ.21,999గా ఉన్నాయి. అంటే గెలాక్సీ A50s యొక్క రెండు వేరియంట్ల మీద రూ.2,500 ధర తగ్గింపును పొందినట్లు గమనించవచ్చు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన తర్వాత గెలాక్సీ A50s కు ఇది రెండో ధర తగ్గింపు. గెలాక్సీ A50s ను మొదట ఇండియాలో వరుసగా రూ.22,999 మరియు రూ.24,999 ధరల వద్ద లాంచ్ చేసారు.

 

 

Realme C3: రూ.6,999 కే 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌Realme C3: రూ.6,999 కే 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

గెలాక్సీ A50s 2019 రెండవ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన మొదటి ఐదు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. గెలాక్సీ A50s 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి + స్క్రీన్‌ను 19.5: 9 కారక నిష్పత్తి మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కలిగి ఉంటుంది. ఇది శామ్సంగ్ యొక్క అంతర్గత ఎక్సినోస్ 9611 చిప్‌సెట్‌ను కలిగి ఉండి 4GB / 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ను ఉపయోగించి మెమొరీని 512GB వరకు పొడగించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది.

 

 

లాంగ్ టర్మ్ వార్షిక ప్లాన్‌లలో నేనే కింగ్ అంటున్న BSNLలాంగ్ టర్మ్ వార్షిక ప్లాన్‌లలో నేనే కింగ్ అంటున్న BSNL

కెమెరా

కెమెరా

ఈ స్మార్ట్‌ఫోన్‌ 4000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతును కలిగి ఉంటుంది. కెమెరాల విషయానికొస్తే దీని వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 48MP సెన్సార్‌తో వస్తుంది. 8MP అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ తో సెకండరీ కెమెరా మరియు 5MP డెప్త్ సెన్సార్‌తో మూడవ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ ఉంటుంది.

 

 

టాటా స్కై మల్టీ టీవీ కనెక్షన్‌లకు సువర్ణ అవకాశంటాటా స్కై మల్టీ టీవీ కనెక్షన్‌లకు సువర్ణ అవకాశం

కనెక్టివిటీ

కనెక్టివిటీ

గెలాక్సీ A50s లో సామ్‌సంగ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది. అధిక మెమొరీ కోసం మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించడానికి అప్‌గ్రేడ్ చేయగల SD స్లాట్ ఉంటుంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, GPS/ A-GPS మరియు USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,000mAH బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

గెలాక్సీ A51

గెలాక్సీ A51

శామ్సంగ్ గెలాక్సీ A51 ను ఇండియాలో దాదాపు ఒకే విధమైన స్పెక్స్‌తో విడుదల చేసింది. కాని మెరుగైన కెమెరాలు మరియు బ్యాటరీ పరిమాణం మెరుగ్గా ఉన్నాయి. భారతదేశంలో గెలాక్సీ A51 రూ.23,999 వద్ద లాంచ్ అయింది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A50s Price Slashed Again in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X