Samsung Galaxy A51 రిలీజ్... లాంచ్ ఆఫర్స్ ఇవే
ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ 10 లైట్ మరియు నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన కొద్ది రోజులకే శామ్‌సంగ్ ఇప్పుడు గెలాక్సీ A51 ను భారత్‌కు తీసుకువచ్చింది. శామ్‌సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్ ఈ రోజు ఇండియాలో సరికొత్త గెలాక్సీ A-సిరీస్ ఫోన్‌గా విడుదల చేయబడింది.

కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. రియల్‌మి X2, రెడ్‌మి K20, వివో V17 వంటి వాటికి పోటీగా శామ్‌సంగ్ ఈ కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. శామ్సంగ్ గెలాక్సీ A51 వాస్తవానికి గత నెలలోనే వియత్నాంలో ప్రారంభించబడింది. గెలాక్సీ A51 ను గెలాక్సీ A50 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్ గా ఇప్పుడు ఇండియాలో ప్రారంభించబడింది.

ధరల వివరాలు
శామ్సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో కేవలం ఒకే ఒక 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ లో విడుదల చేసారు. దీని యొక్క ధర రూ.23,999 గా ఉంది. ఈ ఫోన్ యొక్క సేల్స్ జనవరి 31 నుండి అన్ని రిటైల్ షాప్స్, శామ్‌సంగ్ ఒపెరా హౌస్, శామ్‌సంగ్ ఇ-షాప్ మరియు ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌లలో మొదలు కానున్నాయి.

ఆఫర్స్
శామ్సంగ్ గెలాక్సీ A51 యొక్క లాంచ్ ఆఫర్లలో భాగంగా ఈ ఫోన్ ను కొనుగోలు చేయడానికి అమెజాన్ పేని ఉపయోగించిన వారికి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదనంగా కంపెనీ యొక్క గెలాక్సీ A51 కొనుగోలుదారులకు ఒక సారి స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను ఉచితంగా అందించనుంది.

స్పెసిఫికేషన్స్
డ్యూయల్ నానో సిమ్ స్లాట్ గల శామ్‌సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI 2.0 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్- HD+ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ పరిమాణంలో ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తి వస్తుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది . ఈ ఫోన్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9611 SoC ను కలిగి ఉండడంతో పాటు 8GB RAM తో జతచేయబడి ఉంటుంది.

కెమెరా
శామ్సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 20 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, ఎఫ్ / 2.4 తో 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు f / 2.2 లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో ఎఫ్ / 2.2 సెన్సార్ లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్‌లో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ మెమొరీని కలిగి ఉంటుంది. మరింత మెమొరీ కోసం మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించడానికి శామ్‌సంగ్ అనుమతిని ఇస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ A51 లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి 25W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది.


Click it and Unblock the Notifications








