ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు.. 256GB స్టోరేజీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.17000 తగ్గింపు..!
శాంసంగ్ గత సంవత్సరం మార్చి నెలలో భారత్ మార్కెట్ లో గెలాక్సీ A54 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ పై ప్రస్తుతం ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. శాంసంగ్ ప్రీమియం హ్యాండ్‌సెట్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ఇదే మంచి అవకాశం. ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరా సహా 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A54 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A54 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తోంది. 128GB స్టోరేజీ వేరియంట్ విడుదల సమయంలో ధర రూ.38,999, 256GB స్టోరేజీ ధర రూ.40,999 గా ఉంది. ప్రస్తుతం 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.23,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఏకంగా రూ.17000 డిస్కౌంట్ :
సుమారు రూ.17000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అయితే Awesome Graphite కలర్ వేరియంట్‌పైనే ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A54 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
గెలాక్సీ A54 5G హ్యాండ్‌సెట్ 6.4 అంగుళాల (2400*1080 పిక్సల్స్) ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.
5 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5.1 ను కలిగి ఉంది. అండర్ ది హుడ్ Exynos 1380 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మైక్రో SD కార్డుతో 1TB స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు.
50MP + 32MP సెల్ఫీ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 12MP అల్ట్రావైడ్ కెమెరా మరియు f/2.4 అపేచర్‌తో 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.2 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. వెనుక వైపు LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది.
బ్యాటరీ వివరాలు :
ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి రెండు రోజుల వరకు వినియోగించుకోవచ్చని శాంసంగ్ చెబుతోంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.3, వైఫై 802.11, GPS, A-GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, గైరో, మాగ్నటోమీటర్, లైట్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను అమర్చి ఉంది. ఈ హ్యండ్‌సెట్ 202 గ్రాముల బరువును కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.


Click it and Unblock the Notifications







