Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ A సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధర వివరాలు లీక్‌.. ట్రిపుల్‌ కెమెరా, 5000mAh బ్యాటరీతో రేపే విడుదల!

శాంసంగ్‌ సంస్థ భారత్‌ మార్కెట్లో మార్చి 11వ తేదీన (సోమవారం) శాంసంగ్ గెలాక్సీ A55 5G (Samsung Galaxy A55 5G) మరియు గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్లను (Samsung Galaxy A35 5G) లాంచ్‌ చేయనుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్ల స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పటికే లీక్‌ అయ్యాయి. తాజాగా ఈ ఫోన్‌ ధర వివరాలు లీక్‌ అయ్యాయి.

శాంసంగ్‌ గెలాక్సీ A55, A35 5G స్మార్ట్‌ఫోన్ల ధర వివరాలు : కొన్ని నివేదికలు, లీక్‌ల ఆధారంగా గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ 128GB స్టోరేజీ 480 యూరోలు (భారత కరెన్సీలో సుమారుగా రూ.43,400) గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర 530 యూరోలు (భారత కరెన్సీలో సుమారుగా రూ.48,000) గా ఉంటుంది తెలుస్తోంది.

Samsung Galaxy A55 5G and A35 5G smartphone price leaked

శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ ఫోన్‌ 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర 380 యూరోలు (భారత కరెన్సీలో సుమారుగా రూ.34,400) గా ఉంది. అదే 256GB వేరియంట్ 450 యూరోలు (భారత కరెన్సీలో సుమారుగా రూ.40,700) గా ఉంటుందని తెలుస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ A55, A35 5G స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్ల వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ A55 స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తోపాటు 1665 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ మెటాలిక్‌ ఫ్రేమ్ సహా గొరిల్లా గ్లాస్‌ విస్టక్+ రక్షణను పొందుతుందని సమాచారం.

Samsung Galaxy A55 5G and A35 5G smartphone price leaked

ఈ స్మార్ట్‌ఫోన్ Exynos 1480 CPU ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ మరియు 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాలను కలిగి ఉంటుంది.

శాంసంగ్ A35 5G..120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. Exynos 1380 CPU ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ A55 5G మరియు గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్లు సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విడుదల (Samsung Galaxy A series Launch Date) కానున్నాయి. విడుదల అనంతరం సేల్‌ వివరాలు వెల్లడికానుంది. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై శాంసంగ్‌ కొన్నింటిని ధ్రువీకరించాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A55 5G and A35 5G smartphones price leaked ahead on march 11 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X