50MP కెమెరా, Exynos చిప్‌సెట్, అమోలెడ్ డిస్‌ప్లేతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు.. తొలిసారిగా Knox 3.1 రక్షణ..!
ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ఇవాళ శాంసంగ్ గెలాక్సీ A55 5G (Samsung Galaxy A55 5G), శాంసంగ్ గెలాక్సీ A35 5G (Samsung Galaxy A35 5G) స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు మిండ్ రేంజ్ ధర సెగ్మెంట్‌లో భారత్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు మెరుగైన ఫీచర్లు, స్పెఫికేషన్లతో అందుబాటులోకి వచ్చాయి.
శాంసంగ్ గెలాక్సీ A55 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో వస్తుంది. మరియు ఈ ఫోన్ ఇన్ హౌస్ Exynos 1480 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.

గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 పైన పనిచేస్తుంది. Knox 3.1 రక్షణ పొందుతుంది. నాలుగు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్లు మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందవచ్చని సంస్థ వెల్లడించింది. అయితే ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్‌తో వచ్చింది.
ఈ శాంసంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 32MP కెమెరాలను కలిగి ఉంది. తక్కువ వెలుగులో మెరుగైన ఫొటోలను క్యాప్చర్ చేసేందుకు AI ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ను కలిగి ఉంటుంది.
8GB ర్యామ్, 12GB వేరియంట్లు మరియు 128GB, 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మరియు ఈ శాంసంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఛార్జింగ్ అడాప్టర్‌ను అదనంగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A35 5G స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్ A55 మోడల్ తరహాలోనే 6.6 అంగుళాలు పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో వచ్చింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ Exynos 1380 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత శాంసంగ్ One UI 6.1 OS పైన పనిచేస్తుంది. మరియు Knox 3.1 రక్షణ పొందుతుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ +128GB స్టోరేజీ, 6GB ర్యామ్ +256GB స్టోరేజీ, 8GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మరియు 25W ఫాస్ట్ ఛార్జంగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఈ A35 5G హ్యాండ్‌సెట్ వెనుకవైపు మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైట్ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. దాంతోపాటు వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఈ హ్యాండ్‌సెట్ 13MP కెమెరాలను కలిగి ఉంటుంది.
అయితే భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5G, గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ల ధర, లభ్యత వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఈ వివరాలు మార్చి 14న వెల్లడికానున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు IP67 రేటింగ్‌తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉన్నాయి. మరియు ఆప్టికల్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








