Home
Mobile

ఈ ఫోన్‌పై ఏకంగా రూ.15 వేల డిస్కౌంట్‌.. ప్రీమియం డిజైన్‌, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా..!

Amazon Great Freedom Festival 2025 : అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్ ఫెస్టివల్‌ సేల్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్‌, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర గృహోపకరణాలున్నాయి. అయితే ఈ అమెజాన్‌ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపును పొందవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A55 5G) విడుదల సమయంలో 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.39999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఫోన్‌ రూ.42999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఫోన్‌ రూ.45999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24999 గా ఉంది. అంటే రూ.15 వేల డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.

Samsung Galaxy A55 5G Smartphone price cut

రూ.15 వేల తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు :
మిగిలిన రెండు స్టోరేజీ వేరియంట్స్ ధరలు రూ.26999, రూ.31999 గా ఉంది. ఈ రెండు వేరియంట్స్‌ కూడా భారీ డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.

డిస్‌ప్లే వివరాలు :
గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్‌ + ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP67 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

Samsung Galaxy A55 5G Smartphone price cut

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ Exynos 1480 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్ తెలిపింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలేజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చారు. సర్కిల్‌ టూ సెర్చ్‌ సహా అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.

Samsung Galaxy A55 5G Smartphone price cut

గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, WiFi, బ్లూటూత్‌, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

దీంతోపాటు స్మార్ట్‌ స్విచ్‌, క్విక్‌ షేర్ తోపాటు సెక్యూరిటీ కోసం Knox Vault వంటి ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. మిడ్‌రేంజ్‌ ఫోన్‌ల కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ అనుకూలంగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A55 5G Smartphone gets best deal on amazon great freedom festival 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X