శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.11 వేలు తగ్గింపు.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఫుల్ HD+ డిస్‌ప్లే..!
శాంసంగ్ గత సంవత్సరం గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy A55 5G Pricedrop in india) విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 6.6 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ రూ.40000 ధరలో విడుదల అయింది. ప్రస్తుతం సుమారు రూ.11 వేల తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది.
బేస్ వేరియంట్ పై రూ.11 వేలు తగ్గింపు :
భారత్‌లో విడుదల సమయంలో శాంసంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39999 గా ఉంది. ప్రస్తుతం శాంసంగ్ అధికారిక వెబ్సైట్లో రూ.28999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.11 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు.

అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర విడుదల సమయంలో రూ.42999 గా ఉండేది. ప్రస్తుతం శాంసంగ్ అధికారిక వెబ్సైట్లో రూ.30999 కే కొనుగోలు చేయవచ్చు. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.45999 కి విడుదల కాగా రూ.33999 కే సొంతం చేసుకోవచ్చు.
రెండు కలర్ వేరియంట్స్ :
అంటే ఈ రెండు స్టోరేజీ వేరియంట్స్‌పై రూ.12 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. శాంసంగ్ మిడ్ రేంజ్ ఫోన్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ఈ ఫోన్‌లు Awesome ఐస్ బ్లూ, Awesome నేవీ రంగుల్లో లభిస్తున్నాయి. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో గెలాక్సీ A55 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు ఈ లింక్ పై క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
ఈ ఫోన్ Exynos 1480 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తోపాటు 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మూడో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ IP67 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు Knox vault సెక్యూరిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. మరియు 5G, వైఫై, బ్లూటూత్, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉన్నాయి.
గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.


Click it and Unblock the Notifications