Home
Mobile

ఏకంగా రూ.14 వేల డిస్కౌంట్‌.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ. 6.6 అంగుళాలతో శాంసంగ్ 5G ఫోన్‌..!

శాంసంగ్‌ నుంచి ప్రస్తుతం అనేక మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ లు అందుబాటులో ఉన్నాయి. అయితే గత సంవత్సరం విడుదల అయిన ఫోన్‌ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ తో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ.14 వేల తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP ప్రైమరీ కెమెరాతోపాటు, 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, డిస్కౌంట్‌ పూర్తి వివరాలు.

ఏకంగా రూ.14000 తగ్గింపు..! :
శాంసంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy A55 5G Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.39999 గా ఉండగా.. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.25999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారుగా రూ.14000 తగ్గింపును పొందవచ్చు.

Samsung Galaxy A55 5G smartphone

మిగిలిన వేరియంట్స్‌పైనా :
8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఫోన్‌ రూ.42999 ధరకు విడుదల కాగా.. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.27999 కే సొంతం చేసుకోవచ్చు. సుమారు రూ.13 వేల తగ్గింపును పొందవచ్చు. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఫోన్‌ రూ.45999 ధరకు విడుదల కాగా.. ప్రస్తుతం రూ.30999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు రూ.14000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ :
శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ Exynos 1480 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

డిస్‌ప్లే పరంగా 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్‌ + ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ట్రిపుల్ కెమెరా :
కెమెరా విభాగం పరంగా శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2MP మూడో కెమెరాతో అందుబాటులో ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.

IP67 రేటింగ్‌ :
ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్‌ 5G, 4G, వైఫై, బ్లూటూత్‌, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంది. Knox vault సెక్యూరిటీ ఫీచర్‌తోపాటు భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌లను అమర్చి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP67 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A55 5G smartphone gets Rs 14000 price cut on amazon 2025 june
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X