Home
Mobile

ఈ ఫోన్‌పై రూ.17 వేల డిస్కౌంట్.. 50MP OIS కెమెరా, 5000mAh బ్యాటరీ, సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే!

శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy A55 5G Smartphone) భారత్‌ మార్కెట్లో గత సంవత్సరం విడుదల అయింది. ఈ ఫోన్ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, IP67 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఏకంగా 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. 50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో అందుబాటులోకి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఏకంగా రూ.17 వేల డిస్కౌంట్‌ :
గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.39999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఫోన్‌ రూ.42999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఫోన్‌ రూ.45999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో ఏకంగా రూ.17 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

samsung galaxy A55 5G gets huge pricedrop

రూ.40 వేల ఫోన్.. రూ.24 వేలకే :
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ల ధరలు రూ.23,999, రూ.25,999, రూ.28999 ధరలకు అందుబాటులో ఉంది. అంటే బేస్‌ వేరియంట్ పై రూ.16 వేల డిస్కౌంట్‌ ఉండగా.. మిగిలిన రెండు వేరియంట్స్‌పై రూ.17 వేల తగ్గింపు ధర ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే :
శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌ డిస్‌ప్లే 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్‌ + ప్రొటెక్షన్‌ను పొందుతోంది. ఈ ఫోన్ Awesome ఐస్‌ బ్లూ, Awesome నేవీ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్ Exynos 1480 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ సర్కిల్‌ టు సెర్చ్‌ సహా అనేక AI ఫీచర్లు ఉన్నాయి.

50MP OIS కెమెరా :
ఈ ఫోన్ వెనుక వైపు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2MP మ్యాక్రో సెన్సర్‌ను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ పరంగా 5G, 4G, Wi-Fi, బ్లూటూత్‌, GPS, USB-C ఛార్జింగ్ పోర్టుతోపాటు 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను ఉంది. క్విక్‌ షేర్, Knox Vault వంటి ఫీచర్లున్నాయి. IP67 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy A55 5G Smartphone gets Rs17000 discount on amazon, specifications, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X