Home
Mobile

గెలాక్సీ A35, A55 5G స్మార్ట్‌ఫోన్ల ధరలను వెల్లడించిన శాంసంగ్.. ఈ కార్డులపై రూ.3000 తగ్గింపు..!

శాంసంగ్‌ సంస్థ రెండు రోజుల క్రితం తన మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ A55 5G (Samsung Galaxy A55 5G) మరియు గెలాక్సీ A35 5G (Samsung Galaxy A35 5G) స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. అయితే లాంచ్‌ సమయంలో ఈ రెండు హ్యాండ్‌సెట్ల ధరల వివరాలను వెల్లడించని శాంసంగ్ తాజాగా ధరలపై ప్రకటన చేసింది.

శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ ధర రూ.39,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.42,999, 12GB ర్యామ్‌ +256 స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.45,999 గా ఉంది. అదే గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.30,999, 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.33,999 గా ఉంది.

Samsung Galaxy A55 and A35 5G Smartphones price details

సేల్‌, ఆఫర్లు : ఈ రెండు శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లు సహా ఇతర రిటైల్‌ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు. HDFC, వన్‌కార్డ్‌, IDFC ఫస్ట్‌ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. మరియు 6 నెలలపాటు నోకాస్ట్‌ EMI సౌకర్యాన్ని పొందవచ్చు.

దీంతోపాటు శాంసంగ్‌ ఫైనాన్స్‌ ప్లస్‌ మరియు ఇతర NBFC కార్డుల ద్వారా శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ను నెలకు రూ.1,792 చెల్లించి, గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ను నెలకు రూ.1,723 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని శాంసంగ్‌ కోరింది.

శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణతో వస్తుంది. ఇన్‌ హౌస్‌ Exynos 1480 SoC ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది.

మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 పైన పనిచేస్తుంది. తొలిసారిగా ఈ మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లు Knox 3.1 రక్షణ పొందుతుంది. 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్లు మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందవచ్చని సంస్థ వెల్లడించింది.

ఈ శాంసంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 32MP కెమెరాలను కలిగి ఉంది.

తక్కువ వెలుగులో మెరుగైన ఫొటోలను క్యాప్చర్‌ చేసేందుకు AI ఇమేజ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ను కలిగి ఉంటుంది. ఈ శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఛార్జింగ్‌ అడాప్టర్‌ను అదనంగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్పెసిఫికేషన్లు :
గెలాక్సీ A35 5G 6.6 అంగుళాలు పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వచ్చింది. Exynos 1380 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత శాంసంగ్‌ One UI 6.1 OS పైన పనిచేస్తుంది. మరియు Knox 3.1 రక్షణ పొందుతుంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ A35 5G హ్యాండ్‌సెట్ వెనుకవైపు మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైట్‌ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. దాంతోపాటు వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం ఈ హ్యాండ్‌సెట్ 13MP కెమెరాలను కలిగి ఉంటుంది. రెండు స్మార్ట్‌ఫోన్లు IP67 రేటింగ్‌తో వాటర్‌ మరియు డస్ట్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉన్నాయి. మరియు ఆప్టికల్‌ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A55 and A35 5G Smartphones price details revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X