శాంసంగ్ 5G ఫోన్‌పై రూ.5000 తగ్గింపు.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే..
శాంసంగ్ గత నెలలో గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో గెలాక్సీ A56, A36, A26 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ప్రస్తుతం గెలాక్సీ A56 5G ఫోన్‌ను రూ.5000 మరియు గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.4000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లు ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఈ రెండు ఫోన్‌లు 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ అందిస్తాయి.
* శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A56 5G Smartphone) మెటల్ బాడీతో కూడిన ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ గొరెల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

చిప్‌సెట్ :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ 4nm Exynos 1580 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం AMD Xclipse 540 GPU చిప్‌సెట్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
IP67 రేటింగ్ :
ఈ ఫోన్ సర్కిల్ టూ సెర్చ్ సహా అనేక మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP67 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. అంటే మీటర్ లోతు నీటితో 30 నిమిషాల వరకు ఉన్నా ఈ ఫోన్ డ్యామేజీ కాదు.
కెమెరాలు :
ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో (OIS) 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ ముందువైపు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
గెలాక్సీ A56 5G స్మా్ర్ట్‌ఫోన్ సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. మరియు కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, NFC, GPS, బ్లూటూత్, వైఫై వంటి ఫీచర్‌లున్నాయి. యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కాంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.

ధర, డిస్కౌంట్ ఆఫర్ :
శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.41,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.44,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.47,999 గా ఉంది. ప్రస్తుతం శాంసంగ్ వెబ్‌సైట్ www.samsung.com లో ఈ ఫోన్‌ల ధరలు వరుసగా.. రూ.38,999, రూ.41,999, రూ.44,999 గా ఉన్నాయి.
అంటే రూ.3000 ధర తగ్గింది. దీంతోపాటు HDFC, ICICI బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే విడుదల అయిన కేవలం నెల రోజుల్లోనే రూ.5000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ Awesome లైట్ గ్రే, Awesome గ్రాఫైట్, Awesome ఓలివ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
* శాంసంగ్ గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ కూడా ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ (Samsung Galaxy A36 5G Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మరియు ఈ ఫోన్ కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 7+ రక్షణను పొందుతుంది.
చిప్‌సెట్, OS వివరాలు :
ఈ గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కోసం 6 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని శాంసంగ్ వెల్లడించింది.

బ్యాటరీ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ సర్కిల్ టూ సెర్చ్, ఆబ్‌జెక్ట్ ఎరేజర్ సహా మరిన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
కెమెరా వివరాలు :
ఈ గెలాక్సీ మోడల్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ముందువైపు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ధర, డిస్కౌంట్ వివరాలు :
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.32,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.38,999 గా ఉంది.
ప్రస్తుతం శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ www.samsung.com లో ఈ ఫోన్‌లను వరసగా రూ.30999, రూ.33999, రూ.36999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే విడుదలతో పోలిస్తే రూ.2000 ధర తగ్గింది. దీంతోపాటు HDFC, ICICI బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో రూ.2000 అదనపు తగ్గింపును పొందవచ్చు.
అంటే మొత్తంగా విడుదల అయిన కేవలం నెలరోజుల్లో రూ.4000 తగ్గింపు ధరకు ఈ ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్ Awesome లావెండర్, Awesome బ్లాక్, Awesome వైట్ వంటి మూడు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications








