నీటిలో 30 నిమిషాలు ఉన్నా డ్యామేజీ కాని శాంసంగ్ 5G ఫోన్ విడుదల.. ప్రీమియం డిజైన్, ట్రిపుల్ కెమెరా సహా..!
శాంసంగ్ తాజాగా A సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఇందులో గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ A26 హ్యాండ్‌సెట్‌లను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అద్బుతమైన ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చే విధంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందనుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A56 5G Smartphone) ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. దీంతోపాటు మెటల్ బాడీతో లాంచ్ చేసినట్లు సంస్థ తెలిపింది. IP67 రేటింగ్‌తో వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది. ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ గ్రాఫైట్, లైట్ గ్రే, ఆలివ్ రంగుల్లో లభిస్తుందని సంస్థ తెలిపింది.

శాంసంగ్ గెలాక్సీ A56 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల (1080*2340 పిక్సల్స్) FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1900 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ విక్టస్ + రక్షణను పొందుతుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ A56 5G హ్యాండ్‌సెట్ 4nm Exynos 1580 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తోంది. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం AMD Xclipse 540 GPU చిప్‌సెట్‌ను అమర్చారు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ ఫోన్ ఆరు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్ వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. (OIS) ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 12MP, 5MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, వైఫై, 5G, 4G LTE, NFC, GPS, USB-C ఛార్జింగ్, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కాంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంది. IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 30 నిమిషాల వరకు ఒక మీటర్ నీటిలో ఉన్నా డ్యామేజీ కాదని సంస్థ చెబుతోంది.
శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ ధర :
శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్లలో లాంచ్ అయింది. ప్రారంభ ధర రూ.44 వేలుగా ఉండే అవకాశం ఉంది. Awesome లైట్ గ్రే, Awesome గ్రాఫైట్, Awesome ఓలివ్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








