Home
Mobile

శాంసంగ్ గెలాక్సీ A సిరీస్‌ ఫోన్‌ కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు లీక్‌..!

Samsung Galaxy A57 Smartphone : శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌ గురించి ఇటీవల కొన్ని లీక్స్ వచ్చాయి. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2026 లో భాగంగా ఈ సిరీస్‌ లాంచ్‌ కానుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో ఈ శాంసంగ్‌ ఈవెంట్‌ నిర్వహించే అవకాశం ఉంది. దీంతోపాటు శాంసంగ్‌ నుంచి బడ్జెట్‌, మిడ్‌రేంజ్‌ లో మరిన్ని స్మార్ట్‌ఫోన్‌ లు లాంచ్‌ కానున్నాయి. తాజాగా గెలాక్సీ A సిరీస్‌ ఫోన్ గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి.

గ్లోబల్‌ మార్కెట్‌లో :
శాంసంగ్ గెలాక్సీ A57 5G స్మార్ట్‌ఫోన్‌ త్వరలో గ్లోబల్‌ మార్కెట్‌ లో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే శాంసంగ్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్‌ ఇటీవలే చైనా సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌ TENAA లో కనిపించింది. దీని ఆధారంగా అనేక స్పెసిఫికేషన్‌ ల వివరాలు వెల్లడయ్యాయి.

Samsung Galaxy A57 smartphone

శాంసంగ్ చిప్‌సెట్‌ :
చైనీస్‌ లిస్టింగ్‌ ఆధారంగా గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్‌ Exynos 1680 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు Xclipse 550 GPU ను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 8GB, 12GB ర్యామ్‌ తో 256GB స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత One UI పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.6 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యానిట్‌ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 5MP మైక్రో లెన్స్‌ ఉంటాయని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాతో లాంచ్‌ కానుందని అంచనా వేస్తున్నారు.

ఆప్టికల్‌ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ :
చైనీస్‌ సర్టిఫికేషన్ సైట్‌ ఆధారంగా ఈ ఫోన్ 6.9mm థిక్‌నెస్‌, 182 గ్రాముల బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ భద్రత కోసం ఆప్టికల్‌ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, మెరుగైన ఆడియో సపోర్టు కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లు ఉంటాయని సమాచారం.

ఎంత ధరలో అందుబాటులోకి వస్తుంది? :
శాంసంగ్‌ గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్‌ మార్కెట్‌ లో వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే భారత్‌ మార్కెట్‌ లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.45 వేల ధర రేంజ్‌ లో విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలో ఈ హ్యాండ్‌సెట్‌ గురించి మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A57 smartphone key specifications revealed ahead of expected launch soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X