Home
Mobile

శాంసంగ్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌.. తాజాగా కీలక వివరాలు లీక్‌.. ఎప్పుడు విడుదల కానుంది?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ భారత్ మార్కెట్‌ లో బడ్జెట్‌ రేంజ్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌తోపాటు A, M, F సిరీస్‌ లో వివిధ హ్యాండ్‌సెట్స్‌ను తీసుకొచ్చింది. శాంసంగ్‌ A సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ A17 5G మోడల్‌ను ఆగస్టు నెలలో విడుదల చేసింది. అనంతరం అక్టోబర్‌ నెలలో గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.

త్వరలో గెలాక్సీ A సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది. గెలాక్సీ A57 పేరుతో (Samsung Galaxy A57 5G Smartphone) ఈ ఫోన్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. డిజిట్‌ ఇండియా ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

Samsung Galaxy A57 smartphone

మోడల్‌ నంబర్! :
ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్‌ బెంచ్‌మార్క్‌ ప్లాట్‌ఫాంలలో SM-A576B మోడల్‌ నంబర్‌తో కనిపించినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా శాంసంగ్‌ గెలాక్సీ A57 5G స్మార్ట్‌ఫోన్‌ Exynos 1680 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. మరియు 12GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 16 పైన పనిచేస్తుందని భావిస్తున్నారు.

డిస్‌ప్లే వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ (2340 x 1080 పిక్సల్స్‌) సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1900 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, HDR సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌+ ప్రొటెక్షన్‌, అల్యూమినియం ఫ్రేమ్‌తో విడుదల కానుందని తెలుస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ కెమెరా విభాగం పరంగా OIS (ఆ‌ప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌, 5MP మ్యా్క్రో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ కెమెరాలు 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాలింగ్‌ కోసం 12MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ ఫోన్ 5000mAh కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌ విడుదలపై శాంసంగ్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. శాంసంగ్‌ గెలాక్సీ A57 5G స్మార్ట్‌ఫోన్‌ 2026 సంవత్సరంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్ మార్కెట్‌లో రూ.35 వేల నుంచి రూ.40 వేల ధర రేంజ్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్‌ :
భారత్‌లో ఇటీవలే శాంసంగ్‌ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ HD+ ఇన్ఫినిటీ సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్ ఆక్టా కోర్ Exynos 1330 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌, 2MP మ్యాక్రో లెన్స్‌ మరియు 13MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A57 smartphone listed online here are the expected launch and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X