సామ్‌సంగ్ గెలాక్సీ ఏ6, ఏ6+ ఫీచర్లు చూస్తారా ?

Posted By: M KRISHNA ADITHYA

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ6 అలాగే గెలాక్సీ ఏ6+ మోడల్స్ త్వరలోనే అధికారికంగా విడుదల కానున్నాయి. ఇప్పటికే గీక్ బెంచ్, ఎఫ్‌సీసీ, వైఫై అలయన్స్ లాంటి ప్రఖ్యాత వెబ్ సైట్స్ లో ఈ మోడల్స్ గురించి తెలుపగా, గెలాక్సీ ఏ6+ గురించి పోలాండ్ కు చెందిన సామ్‌సంగ్ అఫీషియల్ వెబ్ సైట్ లో వివరించారు. అయితే ప్రస్తుతం ఈ మోడల్ ను కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందులో రష్యా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలు ఉన్నాయి. మరోవైపు గెలాక్సీ ఏ6, ఏ6+ రెండూ కూడా గత ఏడాది విడుదలైన గెలాక్సీ ఏ8, ఏ8+ వర్షన్ లకు ఇది కొనసాగింపు అంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ విడుదల తేదీలను మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంచారు. అయితే ఒక లీక్ స్టర్ మాత్రం ట్విట్టర్ వేదిక ద్వారా ఈ రెండు ఫోన్ల గురించి పలు రివ్యూలు లీక్ చేస్తున్నాడు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ6, ఏ6+ ఫీచర్లు చూస్తారా ?

గెలాక్సీ ఏ6 విషయానికి వస్తే 5.6 ఇన్ఫినిటీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ 2280X1080 పిక్సెల్స్ సామర్థ్యం కలిగి ఉంది. అలాగే ఎక్సీనోస్ 7870 ప్రాసెసర్ తో పాటు, 3 జీబీ ర్యామ్, అలాగే 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజి కలిగి ఉంది.

ఇక గెలాక్సీ ఏ6+ విషయానికి వస్తే 6 ఇంచుల ఇన్ఫినిటీ డిస్ ‌ప్లే తో పాటు ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ 2280X1080 పిక్సెల్స్ సామర్థ్యం కలిగి ఉంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ కలిగి ఉంది. లీక్ స్టర్ ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ ను కలిగిఉంది. మెమరీ విషయానికి వస్తే సామ్‌సంగ్ గెలాక్సీ ఏ6+ 4జీబీ ర్యామ్ తో పాటు 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంది.

షియోమి సరికొత్త ఎత్తుగడ, ఇండియాలో 50 వేల ఉద్యోగాలు, ఏపీలో ప్లాంటు

ఇక ఆపరేటింగ్ సిస్టం విషయానికి వస్తే ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ను కలిగిఉంది. అలాగే సామ్‌సంగ్ యూఐ 9.0 సాఫ్ట్ వేర్ కలిగి ఉంది. అయితే బ్యాటరీ సామర్థ్యం గురించి మాత్రం లీక్స్ లో ఎక్కడా బయటపడలేదు. కెమెరా సామర్థ్యం కూడా ఇంకా బయట పడలేదు. అయితే ముందుగా అనుకున్నట్లే ఇన్ఫినిటీ డిస్‌ప్లే అనేది ఈ ఫోన్ల ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు. గెలాక్సీ ఏ8, గెలాక్సీ ఏ8+ కారణంగా ఇన్ఫినిటీ డిస్‌ప్లే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ సౌత్ కొరియా దిగ్గజం ఇన్ఫినిటీ డిస్ ‌ప్లేను తన బ్రాండ్ మార్క్ గా కొనసాగించనుంది.

English summary
Samsung Galaxy A6, A6+ to feature Infinity Display, Android Oreo More news at gibot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot