శాంసంగ్ నుంచి బడ్జెట్ ధరలో 2 స్మార్ట్‌ఫోన్లు, షియోమి ఫోన్లకు గట్టి పోటీ
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది.
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. Samsung Galaxy A6, Galaxy A6 plus పేర్లతో ఇవి మార్కెట్లోకి రానున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో పలు ఆకట్టుకునే ఫీచర్లతో పాటు భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె6 ధరను కంపెనీ రూ.18,990గా నిర్ణయించే అవకాశం ఉంది. కాగా గెలాక్సీ ఏ6 ప్లస్ ధర రూ.22, 990గా ఉండే అవకాశం ఉంది. కాగా ఈ రెండు ఫోన్లు షియోమి Redmi 5 and Redmi 5Aలకు గట్టిపోటీ నిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే..

శాంసంగ్ గెలాక్సీ జె6
4GB RAM/32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,990 (అంచనా)
శాంసంగ్ గెలాక్సీ జె6 ఫీచర్లు
5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ జె6 ప్లస్
4GB and 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,990 (అంచనా)
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2220 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్
ఇదిలా ఉంటే శాంసంగ్ సంస్థ తన గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు గాను నూతన రంగు వేరియెంట్లను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్లకు చెందిన మిడ్‌నైట్ బ్లాక్, టైటానియం గ్రే, కోరల్ బ్లూ, లైలాక్ పర్పుల్ కలర్ వేరియెంట్లు ఇప్పటికే లభ్యమవుతుండగా త్వరలో సన్‌రైజ్ గోల్డ్, బర్గండీ రెడ్ కలర్ వేరియెంట్లను విడుదల చేయనున్నారు.

వీటిలో ఫీచర్లు
ఇక వీటిలో ఫీచర్లు గతంలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లలోలాగే ఉంటాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు. కాగా ఈ నూతన వేరియెంట్లు ముందుగా కొరియా మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయి. తరువాత ఇతర దేశాల్లోనూ విడుదల అవుతాయి.

విడుదల తేదీలను
అయితే విడుదల తేదీలను మాత్రం శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. కానీ జూన్ చివరి వారంలో ఈ వేరియెంట్లను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.


Click it and Unblock the Notifications








