Samsung Galaxy 70s స్మార్ట్‌ఫోన్ ధర మీద భారీ తగ్గింపు
శామ్‌సంగ్ యొక్క మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ A70s ల మీద ఇండియాలో ధర తగ్గింపును అందుకున్నది. గత సంవత్సరం ప్రారంభించిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర మీద రూ.3,000 పడిపోయింది. ఇండియాలో గెలాక్సీ A71 ప్రారంభమవుతుందని పుకార్లు వస్తున్న తరుణంలో ఈ కొత్త ధరల తగ్గుదల వెలుగులోకి వచ్చింది.

ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి కూడా ధర తగ్గింపు లభించింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండి ఇన్ఫినిటీ-యు డిస్ప్లేతో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ SoCతో రన్ అవుతుంది. మిగిలిన వివరాల కోసం ముందుకు చదవండి.

కొత్త ధరల వివరాలు
ఇండియాలో గత సంవత్సరం శామ్‌సంగ్ గెలాక్సీ A70s ను రెండు వేరియంట్లలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ను రూ. 27,999 మరియు 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ను రూ.30,999 ధర వద్ద లాంచ్ చేసింది. వీటి మీద తగ్గింపు ధరను పొందిన తరువాత 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.25,999 మరియు 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ఆప్షన్ రూ. 28,999 ధర వద్ద లభిస్తుంది. ఈ తగ్గింపు ధరలు శామ్‌సంగ్ ఇండియా యొక్క ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్‌లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్స్
శామ్‌సంగ్ గెలాక్సీ A70s స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ నానో సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత One UI తో రన్ అవుతుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్- HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 20: 9 కారక నిష్పత్తితో మరియు 1080x2400 పిక్సెల్స్ రెషల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 675 SoC తో రన్ అవుతు 6GB మరియు 8GB RAM ఎంపికలతో జత చేయబడి ఉంటుంది.

కెమెరా
శామ్‌సంగ్ గెలాక్సీ A70s వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో f/ 1.8 సెన్సార్ లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ సెన్సార్ తో మూడవ కెమెరా అమర్చబడి ఉంటాయి. అలాగే ఈ ఫోన్ యొక్క ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

కనెక్టివిటీ
గెలాక్సీ A70s లో సామ్‌సంగ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది. అధిక మెమొరీ కోసం మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించడానికి అప్‌గ్రేడ్ చేయగల SD స్లాట్ ఉంటుంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, GPS/ A-GPS మరియు USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,500mAH బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications