Samsung Galaxy A71 లాంచ్ ఆఫర్స్ చూడతరమా!!!

|

ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది చివరిలో ఆవిష్కరించిన తర్వాత శామ్‌సంగ్ గెలాక్సీ A71 ను ఇప్పుడు భారతదేశంలో విడుదల చేశారు. గెలాక్సీ A70 అప్ డేట్ గా వచ్చిన ఈ కొత్త శామ్‌సంగ్ ఫోన్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది శామ్సంగ్ యొక్క యాజమాన్య వన్ UIతో పాటుగా ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది.

గెలాక్సీ A71
 

శామ్‌సంగ్ గెలాక్సీ A71 ప్రారంభంలో వియత్నాంలో రెండు విభిన్న కాన్ఫిగరేషన్లలో లాంచ్ అయింది. అయితే ఇండియాలో మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే లాంచ్ అయింది. ఇండియా వెర్షన్‌లో స్థానిక వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొన్ని ఫీచర్లు ఉన్నాయి. శామ్సంగ్ యొక్క ఈ కొత్త ఫోన్ వివో V17 ప్రో, ఒప్పో రెనో, రెడ్‌మి K20 ప్రో, వన్‌ప్లస్ 7 వంటి వాటికి గట్టి పోటీని ఇవ్వబోతున్నది.

Tata Sky Binge: ఒక నెల పాటు ఫ్రీ ట్రయల్ సర్వీస్

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ A71 ధరల వివరాలు

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ A71 ధరల వివరాలు

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ A71ను కేవలం ఒకే ఒక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ చేసింది. ఈ వేరియంట్ యొక్క ధర రూ.29,999. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ సిల్వర్ మరియు ప్రిజం క్రష్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 24 నుండి శామ్‌సంగ్ ఒపెరా హౌస్, శామ్‌సంగ్.కామ్ మరియు ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా అమ్మకాలు మొదలుకానున్నాయి.

Jio Fiber యూజర్లు 10 రెట్లు ఎక్కువ డేటాను ఇలా పొందవచ్చు!!!!

 గెలాక్సీ A71

శామ్‌సంగ్ గెలాక్సీ A71 స్మార్ట్‌ఫోన్ డిసెంబర్‌ నెలలో వియత్నాంలో 6 జిబి ర్యామ్ మరియు 8 జిబి ర్యామ్ వేరియంట్‌లలో విడుదల అయ్యింది. ఇవి రెండు వేరియంట్‌లు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గత నెలలో ఇండియాలో లాంచ్ చేసిన శామ్‌సంగ్ గెలాక్సీ A51తో పాటు గల A-సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో రెండవ ఫోన్. గెలాక్సీ A51 యొక్క 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర 23,999 రూపాయలు.

Dish TV Offer: సెట్-టాప్ బాక్స్‌ల మీద లైఫ్‌టైమ్ వారంటీ

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A71 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ (నానో) సిమ్ స్లాట్ కలిగి ఉండి 6.7-అంగుళాల ఫుల్-HD+ (1080x2400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేను 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730 ఆక్టా-కోర్ SoC మరియు ఆండ్రాయిడ్ 10 ను వన్ యుఐ 2.0 తో రన్ అవుతు 8GB RAM తో జత చేయబడి ఉంటుంది.

Samsung Galaxy M31 కొత్త ఫోన్ ధరలు, స్పెసిఫికేషన్స్ ఇవే...

కెమెరా సెటప్

కెమెరా సెటప్

ఈ ఫోన్ యొక్క వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ /1.8 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా ఉన్నాయి. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.2 లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఎఫ్/ 2.2 లెన్స్‌తో వస్తుంది.

Realme X50 Pro 5G: మరో 6 రోజులలో Feb24న ఇండియాలో ప్రారంభం

కనెక్టివిటీ

కనెక్టివిటీ

గెలాక్సీ A71 స్మార్ట్‌ఫోన్ యొక్క మెమొరీ విషయానికొస్తే ఇందులో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. అలాగే ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో భాగంగా డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అంతేకాకుండా ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు గల 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఫీచర్స్

ఫీచర్స్

భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గెలాక్సీ A71 లో కొన్ని ‘మేక్ ఇన్ ఇండియా' ఫీచర్లను శామ్సంగ్ అందించింది. టెక్స్ట్ మెసేజింగ్ యాప్ లో విజువల్ కార్డులు విలీనం చేయబడ్డాయి. ఇవి రిమైండర్‌లు మరియు ఆఫర్‌ల రూపంలో ఉంటాయి. స్థానిక భాషలకు మద్దతు ఇవ్వడానికి హ్యాండ్‌సెట్‌లో బహుభాషా టైపింగ్ కూడా ఉంది. ఫీచర్స్ జాబితాలో ఒకే ఒక ట్యాప్‌తో స్క్రీన్‌షాట్‌ను సేవ్ చేయడానికి, షేర్ చేయడానికి లేదా సవరించడానికి వినియోగదారులను అనుమతించడానికి స్మార్ట్ క్రాప్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy A71 Released in India: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X