ఐదు కెమెరాల సెటప్‌తో లాంచ్ కానున్న Galaxy A72 ‌!! సాఫ్ట్‌వేర్ ఫీచర్స్ బ్రహ్మాండం...

|

ప్రపంచ మొత్తం మీద శామ్సంగ్ సంస్థకు చెందిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఇప్పటికే సంస్థ వినూత్నమైన డిజైన్ మరియు మోడల్లతో అందరిని తన వైపు ఆకర్షిస్తున్నది. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనసాగింపుగా ఇప్పుడు గాలక్సీ A72 స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేస్తున్నది. ఇది వెనుక భాగంలో పెంటా-కెమెరా సెటప్ తో రావడం మరొక ప్రత్యేకత. శామ్సంగ్ సంస్థ ఐదు కెమెరాలతో విడుదల చేస్తున్న మొట్టమొదటి స్మార్ట్ఫోన్ ఇదే కావడం గొప్ప విషయం. ఈ ఫోన్ 2021 మొదటి భాగంలో విడుదల కానుంది. పెంటా-కెమెరా సెటప్ తో శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో ప్రవేశించే గెలాక్సీ A72 మిడ్ సెగ్మెంట్‌లో ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐదు కెమెరాల సెటప్‌తో లాంచ్ కానున్న Galaxy A72 ‌!! ఫీచర్స్ బ్రహ్మాండం..

 

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లో ఇతర కంపెనీలకు పోటీగా ఉండడానికి పరిశ్రమ వర్గాలలో కొత్త దనంలో అందరికంటే ముందువరుసలో ఉండడానికి గెలాక్సీ A72 స్మార్ట్‌ఫోన్‌లో పెంటా-కెమెరా సెటప్ ను కలిగి ఉంటుందని దక్షిణ కొరియా పబ్లికేషన్ ది ఎలెక్ ప్రకటించింది. ఈ సెటప్‌లో 64 మెగాపిక్సెల్ మెగాపిక్సెల్ కెమెరా ప్రైమరీ షూటర్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెకండరీ కెమెరా, ఆప్టికల్ 3X జూమ్‌తో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నట్లు సంస్థ తెలిపింది.

శామ్సంగ్ గెలాక్సీ A72 స్మార్ట్‌ఫోన్‌ ముందు భాగంలో సెల్ఫీలు మరియు మెరుగైన వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి. ఇది 2021 సంవత్సరం ప్రారంభంలో గెలాక్సీ A52 తో పాటు లాంచ్ అవుతుందని నివేదిక పేర్కొంది. గెలాక్సీ A52 స్మార్ట్‌ఫోన్ దాని ముందున్న గెలాక్సీ A51 మాదిరిగా క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లను కలిగి ఉంటుంది అని సంస్థ తెలిపింది.

ఐదు కెమెరాల సెటప్‌తో లాంచ్ కానున్న Galaxy A72 ‌!! ఫీచర్స్ బ్రహ్మాండం..

పెంటా-కెమెరా సెటప్‌ను కలిగి ఉండి మార్కెట్ లో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ A72 మాత్రం కాదు. నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే పెంటా రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండి మార్కెట్ లో విడుదల అయింది. కొన్ని నివేదిక ప్రకారం శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో కెమెరా మాడ్యూళ్ల సంఖ్య వచ్చే ఏడాది నుంచి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

 

మునుపటి నివేదికల ప్రకారం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి ఉన్న A- సిరీస్ ఫోన్లలో గెలాక్సీ A72 విడుదల కానున్నది. వచ్చే ఏడాది హై-ఎండ్ గెలాక్సీ A-సిరీస్ మోడళ్లకు ఓఐఎస్ టెక్నాలజీని తీసుకురావాలని శామ్‌సంగ్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకమైన హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ ట్వీక్‌లతో కూడిన OIS సిస్టమ్ ఫోన్‌ను హ్యాండ్‌హెల్డ్ వాడకంలో మెరుగైన ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy A72 Smartphone Penta Rear Camera Setup Features Revealed: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X