శాంసంగ్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు !

Written By:

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. Galaxy A8, Galaxy A8 Plus పేర్లతో ఈ ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. Galaxy A8 ధర రూ.37,755గా
అలాగే Galaxy A8 Plus ధర రూ.45,320గా ఉంటాయని కంపెనీ అంచనా.. కంపెనీ ఇంకా వీటి ధరలను ప్రకటించలేదు. కాగా జనవరి మొదటి వారం నుంచి ఈ ఫోన్లు అమ్మకానికి వెళ్లనున్నాయి.

జియో రూ. 52 ప్లాన్‌కి రూ 49తో షాకిచ్చిన ఎయిర్‌టెల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ ఎ8 (2018) ఫీచర్లు

5.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ (2018) ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

మొత్తం నాలుగు రంగుల్లో..

మొత్తం నాలుగు రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. Black, Blue, Gold, and Orchid Grey రంగుల్లో ఈ ఫోన్లు వినియోగదారులకు చేరవ కానున్నాయి. కాగా యువతరాన్ని ఆకట్టుకునేలా ఈ ఫోన్లను రూపొందించామని కంపెనీ చెబుతోంది.

ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్..

కాగా ఈ ఫోన్లలో ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ ఉన్న ఇన్ఫినిటీ డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16, 8 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు సెల్ఫీ కెమెరాలను అమర్చారు. ఇవి పవర్‌ఫుల్ కెమెరాలు కావడం వల్ల ఫొటోలు, వీడియోలు క్వాలిటీతో వస్తాయి.

Galaxy A8 (2016)

డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌

అలాగే ఈ ఫోన్లకు ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఫాస్ట్‌చార్జింగ్, శాంసంగ్ పే వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్లలో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy A8 Galaxy A8 Plus (2018) With Dual Selfie Cameras, Infinity Display Launched More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot