శాంసంగ్ నుంచి నాలుగు కెమెరాలతో గెలాక్సీ ఎ9 (2018)
సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ9 2018ను కౌలాలంపూర్ లో లాంచ్ చేసింది .
సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ9 2018ను కౌలాలంపూర్ లో లాంచ్ చేసింది . శాంసంగ్ ఏ సిరీస్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో ముఖ్యంగా భారీ డిస్‌ప్లే, నాలుగు రియర్‌కెమెరాలతో లేటెస్ట్ వెర్షన్‌గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. Lemonade Blue, Bubblegum Pink మరియు Caviar Black కలర్స్ లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 53,700గా ఉంది ఇండియాకి ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.అయితే నవంబర్ చివరిలో వచ్చే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎ9 (2018) ఫీచర్లు
6.30 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ,512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,24+10+8+5 ఎంపీ నాలుగు బ్యాక్ కెమెరాలు,24 ఎంపీ సెల్ఫీ కెమెరా,3800 ఎంఏహెచ్ బ్యాటరీ

మెయిన్ కెమెరా 24 మెగా పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది....
ఫోన్ వెనుక భాగంలో మెయిన్ కెమెరా 24 మెగా పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది f 1/7 apertureతో లభిస్తుంది. క్యాప్చర్ చేయబడే ఫోటోల విషయంలో మరింత డీటెయిల్, బ్రైట్నెస్ పొందటం కోసం ఇది ఉపయోగపడుతుంది. వరుసగా చూస్తే మూడవ స్థానంలో ఈ మెయిన్ కెమెరా పొందుపరచబడుతుంది

పై భాగంలో ఉండే కెమెరా 8 మెగా పిక్సల్ రిజల్యుషన్తో ఉంటుంది....
అన్నింటికంటే పై భాగంలో ఉండే కెమెరా 8 మెగా పిక్సల్ రిజల్యుషన్తో ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్-యాంగిల్ అందిస్తుంది. f/2.4 apertureతోనూ, 120 డిగ్రీల యాంగిల్‌ని ఇది మనకు అందిస్తుంది.

రెండవది అయిన కెమెరా 10 megapixel రిజల్యూషన్తో లభిస్తుంది....
ఇక పై నుంచి రెండవది అయిన కెమెరా 10 megapixel రిజల్యూషన్తో f/2.4 apertureతో లభిస్తుంది. మనుషులకు దగ్గరగా వెళ్లాల్సిన పని లేకుండా ఉన్న చోట నుంచే రెండు రెట్లు ఆప్టికల్ జూమ్ సాధించడం కోసం ఇది ఉపయోగపడుతుంది.

నాలుగవది 5 మెగా పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది....
ఇకపోతే నాలుగవది 5 మెగా పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. f/2.2 apertureతో రూపొందించబడిన ఈ కెమెరా, మనం ఫోటోలు తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యే విధంగా డెప్త్ సెన్సార్‌గా ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications








