భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ ఎ9 (2018) ధర
దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ గత ఏడాది శాంసంగ్ గెలాక్సీ ఎ9 (2018) లాంచ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ ఫోన్ ధరను శాంసంగ్ రూ.3000 తగ్గించింది.
దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ గత ఏడాది శాంసంగ్ గెలాక్సీ ఎ9 (2018) లాంచ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ ఫోన్ ధరను శాంసంగ్ రూ.3000 తగ్గించింది. తొలి రియర్ క్వాడ్ కెమెరా తో ఈ ఫోన్ ను విడుదల చేసింది. టెలిఫొటో, అల్ట్రా-వైడ్, డెప్త్ సెన్సార్‌లతో వెనుక నాలుగు వేర్వేరు కెమెరాలున్నాయి. ముందువైపు 24 ఎంపీ మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ప్యానల్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్‌వోసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. కాగా గెలాక్సీ ఎ సిరీస్‌లో వచ్చిన టాప్ ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. కాగా ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 8 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది.

ధర....
ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్ వేరియెంట్ ధర గతంలో రూ.33,990 ఉండగా ఇప్పుడు ఇది రూ.30,990కే లభిస్తుంది, అలాగే 8 జీబీ ర్యామ్ వేరియెంట్ ధర గతంలో రూ.36,990 ఉండగా ఇప్పుడు ఇది రూ.33,990 కే లభిస్తుంది.

ఫీచర్లు....
6.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 10, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్....
వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయగా, 3800 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. బబుల్‌గమ్ పింక్, కేవియర్ బ్లాక్, లెమొనేడ్ బ్లూ కలర్ వేరియంట్లలో ఈ రెండు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

మెయిన్ కెమెరా 24 మెగా పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది....
ఫోన్ వెనుక భాగంలో మెయిన్ కెమెరా 24 మెగా పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది f 1/7 apertureతో లభిస్తుంది. క్యాప్చర్ చేయబడే ఫోటోల విషయంలో మరింత డీటెయిల్, బ్రైట్నెస్ పొందటం కోసం ఇది ఉపయోగపడుతుంది. వరుసగా చూస్తే మూడవ స్థానంలో ఈ మెయిన్ కెమెరా కలిగి ఉంది.

పై భాగంలో ఉండే కెమెరా 8 మెగా పిక్సల్ రిజల్యుషన్తో ఉంటుంది....
అన్నింటికంటే పై భాగంలో ఉండే కెమెరా 8 మెగా పిక్సల్ రిజల్యుషన్ తో ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్-యాంగిల్ అందిస్తుంది. f/2.4 apertureతోనూ, 120 డిగ్రీల యాంగిల్‌ని ఇది మనకు అందిస్తుంది.

రెండవది అయిన కెమెరా 10 megapixel రిజల్యూషన్ తో లభిస్తుంది....
ఇక పై నుంచి రెండవది అయిన కెమెరా 10 megapixel రిజల్యూషన్ తో f/2.4 apertureతో లభిస్తుంది. మనుషులకు దగ్గరగా వెళ్లాల్సిన పని లేకుండా ఉన్న చోట నుంచే రెండు రెట్లు ఆప్టికల్ జూమ్ సాధించడం కోసం ఇది ఉపయోగపడుతుంది.

నాలుగవది 5 మెగా పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది....
ఇకపోతే నాలుగవది 5 మెగా పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. f/2.2 apertureతో రూపొందించబడిన ఈ కెమెరా, మనం ఫోటోలు తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యే విధంగా డెప్త్ సెన్సార్‌గా ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications








