ఆ సంచలన శాంసంగ్ ఫోన్ ఇండియాకి రాబోతోంది

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఈ మధ్య ప్రపంచపు తొలి క్వాడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్‍ శాంసంగ్ గెలాక్సి ఎస్9ని మలేషియాలో లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మొబైల్ అతి త్వరలోనే ఇండియాకి రాబోతోంది. ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం శాంసంగ్ దీని గురించి ఎటువంటి వివరాలు బహిర్గతపరచనప్పటికీ కొన్ని విషయాలను లీక్ చేసింది. అయితే దీని లాంచ్ డేట్ ఎప్పుడనేది కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ ఫోన్ కంపెనీ ఇండియా అఫిషఇయల్ వెబ్ సైట్లో రిజిస్టర్ అయింది. కాబట్టి అతి త్వరలోనే ఇండియాకి వస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఓపెన్ సేల్ పై రెడ్‌మి 6, రెడ్‌మి 6 ప్రొ

ధర
 

ధర

కాగా ఈ ఫోన్ ధర ఇండియాలో సుమారు రూ. 40 వేలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య చైనా కంపెనీ వన్ ప్లస్ లాంచ్ చేసిన వ్ ప్లస్ 6టికి కంపెనీ గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

4 కెమెరాలతో శాంసంగ్ గెలాక్సీ ఏ9

4 కెమెరాలతో శాంసంగ్ గెలాక్సీ ఏ9

3 కెమెరాలతో గెలాక్సీ ఏ7 స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ తీసుకువచ్చి వినియోగదారులను ఆశ్యర్యానికి గురిచేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ అనుభూతిని ఆస్వాదించకముందే 4 కెమెరాలతో శాంసంగ్ గెలాక్సీ ఏ9ను తీసుకువచ్చి మరింత ఆశ్యర్యానికి గురి చేసింది.

కెమెరాలు

కెమెరాలు

ఈ ఫోన్‌లో వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉన్నాయి. 24, 8, 10, 5 మెగాపిక్సల్ కెమెరాలు ఈ ఫోన్ వెనుక భాగంలో ఉన్నాయి. ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లే ఉంది. 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. 3800 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.

తొలి ఫోన్ ఇదే
 

తొలి ఫోన్ ఇదే

ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్, క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ లాంటి మరిన్ని ప్రత్యేకతలు ఈ ఫోన్ లో కనిపిస్తున్నాయి. ప్రపంచంలో 4 కెమెరాలతో వచ్చిన తొలి ఫోన్ ఇదేనని శాంసంగ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇన్‌బిల్ట్‌లో డిజిటల్ అసిస్టెంట్ బిక్స్‌బై, సాంసంగ్ పే, శాంసంగ్ హెల్త్ ఉంటాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎ9 2018 ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎ9 2018 ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 8, 10, 5 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Most Read Articles
Best Mobiles in India

English summary
South korea tech gaint Samsung Recently launched the world's First QUard camera Smrtphone Samsung galaxy a9 in Malaysia and now it is expected that the company will soon launch the handset in india more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X