Home
Mobile

4 కెమెరాలతో శాంసంగ్ Galaxy A9 సంచలనం,ధర రూ.36,999

దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. తొలి రియర్ క్వాడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎ9(2018)ను భారత్‌లో విడుదల చేసింది.

దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. తొలి రియర్ క్వాడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎ9(2018)ను భారత్‌లో విడుదల చేసింది. టెలిఫొటో, అల్ట్రా-వైడ్, డెప్త్ సెన్సార్‌లతో వెనుక నాలుగు వేర్వేరు కెమెరాలున్నాయి. ముందువైపు 24 ఎంపీ మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ప్యానల్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్‌వోసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. కాగా గెలాక్సీ ఎ సిరీస్‌లో వచ్చిన టాప్ ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. కాగా ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 8 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ9 2018 ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎ9 2018 ఫీచర్లు

6.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 10, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌....

వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌....

వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయగా, 3800 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. బబుల్‌గమ్ పింక్, కేవియర్ బ్లాక్, లెమొనేడ్ బ్లూ కలర్ వేరియంట్లలో ఈ రెండు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

ధర....

ధర....

ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.36,990 ఉండగా, 8 జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.39,990 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ఎయిర్‌టెల్ స్టోర్స్‌లలో ఈ ఫోన్‌కు ప్రీబుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించారు.

 

 

ఈ నెల 28 నుంచి....

ఈ నెల 28 నుంచి....

ఎయిర్‌టెల్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, శాంసంగ్ షాప్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ఈ నెల 28 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ముందస్తు బుకింగ్ కూడా చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డుతో శాంసంగ్ గెలాక్సీ ఎ9ను కొనుగోలు చేస్తే రూ.3 వేల క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A9 (2018) with four rear cameras launched in India at Rs 36,990 more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X