4జీబి ర్యామ్, 5000 mAh బ్యాటరీతో సామ్‌సంగ్ ఫోన్, 26 నుంచి మార్కెట్లోకి
Galaxy A9 Pro పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ శుక్రవారం భారత్‌లో లాంచ్ చేసింది. ధర రూ.32,490. మెటల్ ఇంకా గ్లాస్ డిజైన్ కలబోతతో వస్తోన్న ఈ ఫోన్ ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా చెప్పుకోవచ్చు.
Read More : ఆ ఫోన్‌లను సగం ధరకే అమ్మేస్తున్నారు..?

సెప్టంబర్ 26 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ మార్కెట్లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే
6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటక్షన్,

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ TouchWiz యూజర్ ఇంటర్‌ఫేస్ ఆన్ టాప్,

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 258జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

రేర్ ఫేసింగ్ కెమెరా
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : f/1.9 aperture, ఎల్ఈడి ఫ్లాష్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేైజేషన్)

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ( ప్రత్యేకతలు: f/1.9 aperture, వైడ్ యాంగిల్ సపోర్ట్, హెచ్‌డీఆర్ సపోర్ట్, palm సెల్ఫీ, ఫేస్ బ్యూటిఫికేషన్),

బ్యాటరీ బ్యాకప్
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఫోన్ బ్యాటరీ సామర్థ్యం సింగిల్ ఫుల్ చార్జ్ పై 22.5 రోజుల స్టాండ్ బై టైమ్‌గా ఉంది. టాక్ టైమ్ వచ్చేసరికి 32.5 గంటలు, వీడియో ప్లే బ్యాక్ టైమ్ వచ్చేసరికి 26 గంటలు. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌లో భాగంగా ఫోన్ మొత్తం బ్యాటరీని 160 నిమిషాల్లో ఫుల్‌గా చార్జ్ చేయవచ్చు. 30 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 32% బ్యాటరీ చార్జ్ అవుతుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్
ఫోన్‌ను వేగవంతంగా యాక్సెస్ చేసుకునేందుకు ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థను డివైస్ హోమ్ బటన్ భాగంలో నిక్షిప్తం చేసారు. అలానే Knox security, స్ర్కీన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లు ఆకట్టుకంటాయి.

కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే..
4జీ, వై-ఫై 802.11 a/b/g/n/ac, బ్లుటూత్ వీ4.2, యూఎస్బీ 2.0, ఎన్ఎఫ్‌సీ,

కలర్ వేరియంట్స్
ఫోన్ బరువు వచ్చేసరికి 210 గ్రాములు. బ్లాక్, గోల్డ్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








