సామ్‌సంగ్ ఫోన్ పేలింది!
నిద్రిస్తుండగా తన పక్కన ఉన్న సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ ఫోన్ పేలుడికి గురైందని ఒంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని వెల్లడించింది. అక్టోబర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సామ్‌సంగ్ అందజేసిన కొత్త ఫోన్‌తో హోప్ క్యాసిర్లీ, పక్కన అగ్ని ప్రమాదానికి గురైన పరుపు
Image credits: bestmobs.com
అక్టోబర్ 22 అర్థరాత్రి 1.30 ప్రాంతంలో తన పక్కన పేలుడు శబ్ధం వినిపించటంతో ఉలిక్కిపడిలేచానని సీబీసీ న్యూస్‌కు బాధితురాలు హోప్ క్యాసిర్లీ తెలిపారు. ఆ సమయంలో తన భుజం మీదగా ఓ కాంతి వెళ్లిందని, ఏం జరుగుతోందో తెలుసుకునే లోపుగానే ఆ ఫైర్ గోడను తాకి మంచం మీద పడిందని తలగడ సాయంతో ఆ మంటను నిలువరించే ప్రయత్నం చేసానని, అదే సమయంలో ఇంకో మంటను తన మంచం పై గుర్తించానని హోప్ వివరించించారు.
గుదిలో లైట్లను ఆన్‌చేసి చూసే సరికి తన ఫోన్ బ్యాటరీ భాగం పూర్తిగా ధ్వంసమై ఉందని, ఆ సమయంలో ఫోన్ చార్జింగ్‌లో కూడా లేదని హోప్ తెలిపింది. ఈ ఘటను సంబంధంచి వెంటనే సామ్‌సంగ్‌కు ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు నిమిత్తం ఫోన్‌ను కొరియాకు పంపారు.
కస్టమర్ ఫిర్యాదును స్వీకరించిన తాము, మరో డివైస్‌ను ఆమెకు బదులుగా ఇచ్చామని, ఫోన్‌లో ఉన్న నాసిరకం బ్యాటరీ కారణంగానే ఈ పేలుడు సంభవించినట్లు సామ్‌సంగ్ సీబీసీ న్యూస్‌కు వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా నాణ్యమైన బ్యాటరీలను మాత్రమే కొనుగులో చేయాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.


Click it and Unblock the Notifications








