సామ్‌సంగ్ గెలక్సీ నుంచి మరో అప్‌గ్రేడ్!!!

Posted By: Prashanth

సామ్‌సంగ్ గెలక్సీ నుంచి మరో అప్‌గ్రేడ్!!!

 

గెలక్సీ సిరీస్‌లో వస్తున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు అంతర్జాతీయంగా ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్‌ల సంఖ్యలో యూజర్లను ఆకట్టుకుంటున్న సామ్‌సంగ్ యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్, వేగవంతమైన ప్రాసెసింగ్ ప్రధాన లక్ష్యంగా గ్యాడ్జెట్‌లను డిజైన్ చేస్తుంది. తాజాగా ఈ మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ ‘గెలక్సీ ఏస్’ అప్‌గ్రేడ్‌కు శ్రీకారం చుట్టింది. ‘గెలక్సీ ఏస్ ప్లస్’గా వస్తున్న అప్‌గ్రేడెడ్ స్మార్ట్ ఫోన్ విశేషాలు.

‘గెలక్సీ ఏస్ ప్లస్’ ఫీచర్లు:

* స్మార్ట్‌ఫోన్ బరవు 115 గ్రాములు, * చుట్టు కొలతలు 114.5X62.5X 11.2 mm,* స్ర్కీన్ డిస్‌ప్లే 3.65 అంగుళాలు, * రిసల్యూషన్ 320 X 480 పిక్సల్స్, * టచ్ విజ్ UI మల్టీ టచ్ వ్యవస్థ, * లౌడ్ స్పీకర్ వ్యవస్థ, * ఇంటర్నల్ మెమరీ 3జీబి, మైక్రో‌ఎస్డీ వ్యవస్థ ద్వారా జీబి శాతాన్ని 32కు పెంచుకునే సాలభ్యత, * 512 ఎంబీ ర్యామ్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, హెచ్‌ఎస్‌డీపీఏ, మైక్రో యూఎస్బీ వంటి అత్యాధునిక డేటా ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్స్, * బ్లూటూత్, వై-ఫై కనెక్టువిటీ ఫీచర్స్ , శక్తివంతమైన 5 మెగా పిక్సల్ కెమెరా, * ఆండ్రాయిడ్ వర్షన్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * వేగవంతమైన పనితీరునందించే 1 GHz ప్రాసెసర్, * యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, కంపాస్ వంటి సెన్సార్ వ్యవస్థలు.

డివైజ్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్, డేటా ట్రాన్స్‌ఫర్ ఫీచర్లు వేగవంతమైన పనితీరును కనబరుస్తాయి. ‘సామ్‌సంగ్ గెలక్సీ ఏస్ ప్లస్’ ధర అదే విధంగా విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot