గీకొచ్చు...నొక్కొచ్చు!

Posted By: Super

గీకొచ్చు...నొక్కొచ్చు!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల నిర్మాణ సంస్థ సామ్‌సంగ్, ‘గెలాక్సీ ఏస్ క్యూ’ పేరుతో సరికొత్త క్వర్టీ ఫోన్‌ను ప్రకటించింది. పటిష్టమైన మొబైలింగ్ ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్ ఖచ్చితంగా 121గ్రాముల బరువును కలిగి ఉంటుంది. టైపింగ్‌కు అనువుగా ఉండే

క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌లకు డిమాండ్ నెలకున్న నేపధ్యంలో ఈ ఏస్ క్యూ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ డివైజ్ కీలక ఫీచర్లు...

క్వర్టీ కీబోర్డ్,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

3.2 అంగుళాల స్ర్కీన్(మల్టీ టచ్),

800మెగాహెట్జ్ క్వాల్కమ్ ప్రాసెసర్,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

3.15 మెగా పిక్సల్ సీఎమ్‌వోఎస్ సెన్సార్ కెమెరా (ఆటోఫోకస్, ఆప్టికల్ జూమ్),

మైక్రోఎస్‌డి కార్డ్‌స్లాట్ సౌజన్యంతో మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

512ఎంబీ ర్యామ్,

1300ఎమ్ఏహెచ్ స్టాండర్డ్ లితియమ్ బ్యాటరీ.

జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. పొందుపరిచిన జీపీఆర్ఎస్, ఎడ్జ్ నెట్‌వర్కింగ్ వ్యవస్థలు ఉత్తమమైన బ్రౌజింగ్‌ను అందిస్తాయి. ఏర్పాటు చేసిన క్వర్టీ కీబోర్డ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు తోడ్పడుతుంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 3 మెగా పిక్సల్ కెమరా సీఎమ్‌వోఎస్ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉంటుంది. నిక్షిప్తం చేసిన ఆడియో ప్లేయర్, వీడియ్ ప్లేయర్ అప్లికేషన్‌‍లు మన్నికతో కూడిన వినోదాన్ని చేరువ చేస్తాయి. 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ మన్నికైన బ్యాకప్ ను అందిస్తుంది. కనెక్టువిటీత ఆప్షన్‌లైన యూఎస్బీ, బ్లూటూత్, వై-ఫైలు చురుకుగా స్పందిస్తాయి. ఫోన్ ధర ఇతర విడుదల అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot