సమ్మర్‌లో హిట్ కొట్టేందుకు

Posted By: Staff

సమ్మర్‌లో హిట్ కొట్టేందుకు

 

ఈ వేసవిని తన వసం చేసుకునేందుకు శామ్‌సంగ్ సన్నాహాలు చేస్తుంది. గెలక్సీ బీమ్ పేరుతో ఓ అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను  ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ నాటికి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1జిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4 అంగుళాల టచ్ స్ర్కీన్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి, ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, ఎడ్జ్, బ్లూటూత్, యూఎస్బీ,  2జీ నెట్‌వర్క్ సపోర్ట్  (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900).

ఫోన్‌లో లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం స్ర్కీన్ పై వివిధ అప్లికేషన్‌లను సునాయాసంగా రన్ చేసుకునేందుకు సహకరిస్తుంది. ఈ వోఎస్ ద్వారా ఆండ్రాయిడ్ మార్కెట్లోకి లాగినై  వివిధ అప్లికేషన్‌లను సమర్థవంతంగా డౌన్‌‍లోడ్ చేసుకోవచ్చు.

హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన ప్రొజెక్టర్ పెద్ద పెద్ద తెరలపై వీడియోలతో పాటు ఫోటోలను ప్రదర్శించేందుకు ఉపకరిస్తుంది. లేటెస్ట్ అల్ట్రాబ్రైట్ టెక్నాలజీని

ఈ ప్రొజెక్టర్‌లో నిక్షిప్తం చేశారు. ఫోన్ ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ నాణ్యమైన ఫోటోగ్రఫీ ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానున్న గెలక్సీ బీమ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot