6జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ ఫోన్, రేపే మార్కెట్లోకి?

గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యుర్‌తో పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన సామ్‌సంగ్ గురించి ఓ ఆసక్తికర సమాచారం వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. సామ్‌సంగ్ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన 'గెలాక్సీ సీ9' (Galaxy C9), అక్టోబర్ 21న అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Read More : 10జీబి 4జీ డేటా రూ.259కే, అన్ని ఫోన్‌లకు వర్తిస్తుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ సీ9 టీజర్

గెలాక్సీ సీ9 ఆవిష్కరణకు సంబంధించి సామ్‌సంగ్ లాంచ్ చేసిన ఓ టీజర్ చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ Weiboలో హల్‌చల్ చేస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నెల క్రితం నుంచే ..

నెల క్రితం నుంచే ఈ ఫోన్‌‌కు సంబంధించిన వివరాలు ప్రముఖ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌ల ద్వారా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

రూమర్ మిల్స్ ప్రకారం..

రూమర్ మిల్స్ రివీల్ చేసిన వివరాల ప్రకారం.. గెలాక్సీ సీ9 ఫోన్ 6 అంగుళాల డిస్ ప్లే, 1.4గిగాహెర్ట్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ సీపీయూ, 6జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన స్సెక్స్‌తో రాబోతోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీనా లిస్టింగ్స్ ప్రకారం..

టీనా లిస్టింగ్స్ ప్రకారం.. గెలాక్సీ సీ9 ఫోన్ ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లేతో రాబోతోంది. ఆండ్రాయిడ్ 6.0.1 ఆపరేటింగ్ సిస్టం ఫోన్ రన్ అవుతుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి స్పెక్స్ ఈ ఫోన్‌లో ఉండబోతున్నాయి.

గెలాక్సీ సీ9 ప్రో

మరికొన్ని లీక్స్ ప్రకారం సామ్‌సంగ్ తన గెలాక్సీ సీ9 ఫోన్‌తో పాటుగా ‘గెలాక్సీ సీ9 ప్రో'ను కూడా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ డివైస్‌కు సంబంధించి ఏ విధమైన సమాచారం అందుబాటులో లేదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Samsung Galaxy C9 Launch Set for October 21. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting