సామ్‌సంగ్ 6జీబి ర్యామ్ ఫోన్‌ బుకింగ్స్ ప్రారంభం (రూ.36,900)

సామ్‌సంగ్ తన గెలాక్సీ సీ సిరీస్ నుంచి C9 Pro పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. 6జీబి ర్యామ్ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.36,900. ఈ ఫోన్‌కు సంబంధించిన ముందస్తు బుకింగ్స్ సామ్‌సంగ్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి.

సామ్‌సంగ్ 6జీబి ర్యామ్ ఫోన్‌ బుకింగ్స్ ప్రారంభం (రూ.36,900)

ఫిబ్రవరి 12 వరకు ఈ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 27 నుంచి డెలివరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి వన్-టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్ని సామ్‌సంగ్ కల్పిస్తోంది. రోజ్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

సామ్‌సంగ్ 6జీబి ర్యామ్ ఫోన్‌ బుకింగ్స్ ప్రారంభం (రూ.36,900)

గెలాక్సీ సీ9 ప్రో స్పెసిఫికేషన్స్..

ఫుల్ మెటల్ బాడీ, 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653 (4 x 1.95GHz + 4 x 1.44GHz) ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 6జీబి ర్యామ్ కెపాసిటీ, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

సామ్‌సంగ్ 6జీబి ర్యామ్ ఫోన్‌ బుకింగ్స్ ప్రారంభం (రూ.36,900)

4000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ), ఫోన్ చుట్టుకొలత 162.9 x 80.7 x 6.9మిల్లీ మీటర్లు, బరువు 185 గ్రాములు.

English summary
Samsung Galaxy C9 Pro is now up for pre-order for Rs 36,900. Read Morer in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting