గెలాక్సీ సీ9 ప్రో vs వన్‌ప్లస్ 3టీ

2016లో తీవ్రమైన ఒడిదుడుకులను చవిచూసిన సామ్‌సంగ్ చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఓ శక్తివంతమైన ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ సీ9 ప్రో పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ పై అందుబాటులో ఉంది. బుక్ చేసుకున్న వారికి ఫిబ్రవరి 17 నుంచి డెలివరీ ఉంటుంది. 6జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.36,900గా ఉంది.

గెలాక్సీ సీ9 ప్రో  vs వన్‌ప్లస్ 3టీ

సామ్‌సంగ్ గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా వన్‌ప్లస్ 3టీ ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోంది. 6జీబి ర్యామ్ ఇంకా 128జీబి స్టోరేజ్ సదుపాయంతో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను Amazon India ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.34,999. స్పెసిఫికేషన్స్ పరంగా గెలాక్సీ సీ9 ప్రో ఆకట్టుకుంటున్నప్పటికి వన్‌ప్లస్ 3టీ అంతకు ధీటైన స్పెసిఫికేషన్‌లతో దుమ్మురేపుతోంది. ఈ రెండు ఫోన్‌ల మధ్య spec comparisonను పరిశీలించినట్లయితే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్

డిజైన్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మెటాలిక్ యునిబాడీతో వస్తున్నాయి. వన్‌ప్లస్ 3టీ ఫోన్ 7.4 మిల్లీమీటర్ల మందాన్ని కలిగి ఉండగా, గెలాక్సీ సీ9 ప్రో కేవలం 6.9 మిల్లీమీటర్ల మందంతో వస్తోంది. ఈ రెండు ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌ను ముందు భాగంలో, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్‌ను అడుగు భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది. వన్‌ప్లస్ 3టీ ఫోన్, గన్ మెటల్ ఇంకా సాఫ్ట్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. గెలాక్సీ సీ9 ప్రో విషయానికి వచ్చేసరికి గోల్డ్, బ్లాక్, పింక్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో స్వల్ప మార్పులను మనం చూడొచ్చు. గెలాక్సీ సీ9 ప్రో 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ (1080 x 1920) సూపర్ అమోల్డ్ డిస్ ప్లేను కలిగి ఉండగా, వన్‌ప్లస్ 3టీ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది.

ప్రాసెసర్, ర్యామ్ ఇంకా స్టోరేజ్

ప్రాసెసర్, ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 3టీ ఫోన్ 2.35 GHz క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 చిప్‌సెట్‌తో వస్తోంది. 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీని ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. ఎక్ప్‌ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్ఫన్ లేదు.

ఇదే సమయంలో గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 1.95GHz స్నాప్‌డ్రాగన్ 653 ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో వస్తోంది. 6జీబి ర్యామ్‌తో పాటు, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. ఎక్ప్‌ప్యాండబుల్ స్టోరేజ్ సౌకర్యం ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని మరింతగా పెంచుకోవచ్చు.

 

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి గెలాక్సీ సీ9 ప్రోతో పోలిస్తే ఒక అడుగు ముందంజలో ఉన్న వన్‌ప్లస్ 3టీ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది. ఇదే సమయంలో గెలాక్సీ సీ9 ప్రో, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది. త్వరలోనే నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశముంది.

కెమెరా

కెమెరా విషయానికి వచ్చేసరికి మెగా పిక్సల్స్ పరంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. గెలాక్సీ సీ9 ప్రో కెమెరా విభాగాన్ని పరిశీలించినట్లయితే ఫోన్ వెనుక భాగంలో 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది.ఎఫ్/1.9 అపెర్చుర్, పీడీఏఎఫ్, డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలోనూ 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను సామ్‌సంగ్ ఏర్పాటు చేసింది. ఎఫ్/1.9 అపెర్చుర్‌తో వస్తోన్న ఈ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్‌ను నిర్వహించుకోవచ్చు. ఇదే సమయంలో వన్‌ప్లస్ 3టీ ఫోన్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సౌర్యంతో 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఎఫ్/2.0 అపెర్చుర్‌, పీడీఏఎఫ్, ఓఐఎస్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలతో వస్తోంది.

బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ

బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి సామ్‌సంగ్ తన గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4000 mAh బ్యాటరీని ఏర్పాటు చేయటం జరిగింది. ఇదే సమయంలో వన్‌ప్లస్ 3టీ ఫోన్ 3400 mAh బ్యాటరీతో వస్తోంది. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి 4జీ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్, NFC వంటి సిమిలర్ ఫీచర్లు ఈ రెండు ఫోన్‌లలో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy C9 Pro vs OnePlus 3T. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot