సామ్‌సంగ్ గెలాక్సీ చాట్..ఇండియాలో హాట్ ఎంట్రీ!

Posted By: Staff

సామ్‌సంగ్ గెలాక్సీ చాట్..ఇండియాలో హాట్ ఎంట్రీ!

 

 

డిజిటిల్ మీడియా టెక్నాలజీ విభాగంలో సంచనాలు సృష్టిస్తున్న సౌత్ కొరియన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రపంచ దేశాల్లో తన సత్తాను చాటుతోంది. జూలైలో ఈ బ్రాండ్ ప్రకటించిన స్మార్ట్‌ఫోన్  ‘గెలాక్సీ చాట్’ ఇప్పటికే యూరోప్, లాటిన్ అమెరికాల, చైనా, దక్షిణ ఆసియా దేశాల్లో విడుదలై హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు గడిచిన వారాంతం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్ కామ్ ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.8,499కి ఆఫర్ చేస్తోంది.

Read in English

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

3 అంగుళాల టచ్‌స్ర్కీన్, స్లీక్ ఇంకా కాంపాక్ట్ డిజైనింగ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

ఫోన్ బరువు 112 గ్రాములు,

సామ్‌సంగ్ చాట్‌ఆన్ మెసెంజర్ ఆప్షన్,

గేమ్ హబ్,

హైఎండ్ మల్టీమీడియా ఆప్షన్స్.

గెలాక్సీ ఎస్3 కోసం ప్రత్యేక బ్యాటరీ!

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి విడుదలై అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపుతెచ్చుకున్న ‘గెలాక్సీ ఎస్3’(Galaxy S3) ఇప్పుడు మరింత శక్తివంతం కాబోతుంది. ఈ మెగా ఫోన్‌కు సంబంధించి స్పేర్ బ్యాటరీని రిటైల్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు సామ్‌సంగ్ వర్గాలు ప్రకటించాయి. 2,100ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల ఈ బ్యాటరీ 3జీ నెట్‌వర్క్ పై 11 గంటల టాక్‌టైమ్‌తో పాటు 790 గంటల స్టాండ్‌బై టైమ్‌ను సమకూరుస్తుంది. 2జీ నెట్‌వర్క్ పై 21 గంటల టాక్‌టైమ్‌తో పాటు 900 గంటల స్టాండ్‌బైని అందిస్తుంది. ధర రూ.1599. ఇటీవల ‘గెలాక్సీ ఎస్3’ ప్రపంచవ్యాప్త అమ్మకాల సంఖ్యను సామ్‌సంగ్ బహిర్గతం చేసింది. మేలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ 3 నెలల వ్యవధిలోనే 20 మిలియన్ యూనిట్లను క్రాస్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot