సామ్‌సంగ్ ఫోన్ పై రూ.4,000 వరకు ధర తగ్గింపు, త్వరపడండి

కొద్ది నెలల క్రితం దేశీ మార్కెట్లో సామ్‌సంగ్ విడుదల చేసిన మధ్యముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ కోర్2 తాజాగా ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ల విడుదల నేపథ్యంలో భారీ ధర తగ్గింపును అందుకుంది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.11,990కాగా తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.8,007కే లభ్యమవుతోంది. ఈ సమాచారాన్ని ముంబైకు చెందిన ప్రముఖ రిటైలర్ మహేష్ టెలికామ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2 కీలక స్పెసిఫికేషన్‌లు:
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 768ఎంబి ర్యామ్, సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్+, గ్లోనాస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 130.2 x 67.9 x 9.8 మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 138 గ్రాములు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications