జనవరి రెండవ వారంలో సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ అడ్వాన్స్!!

Posted By:

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్, ఇండియన్ యూజర్ల కోసం త్వరలో సరికొత్త మధ్య ముగింపు స్మార్ట్‌ఫో‍‌న్‌ను పరిచయం చేయబోతోంది. సామ్‌సంగ్ నుంచి ఇదువరుకే విడుదలైన గెలాక్సీ కోర్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా రూపుదిద్దుకున్నఈ డివైజ్ పేరు సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ అడ్వాన్స్. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ హోమ్‌షాప్18 తన లిస్టింగ్స్‌లో పేర్కొన్న వివరాల మేరకు గెలాక్సీ కోర్ అడ్వాన్స్ జనవరి రెండవ వారంలో మార్కెట్లో విడుదల కాబోతుంది.

జనవరి రెండవ వారంలో సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ అడ్వాన్స్!!

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లియితే:

4.7 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 480 x 800పిక్సల్స్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ  కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కనెక్టువిటీ ఫీచర్లు:

ఎఫ్ఎమ్ రేడియో, 3జీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్ 4.0, 2జీ ఎడ్జ్ కనెక్టువిటీ, వై-ఫై, ఏజీపీఎస్, ఫిజికల్ నేవిగేషన్ బటన్.

ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసిన ప్రత్యేకమైన అప్లికేషన్‌లు: సౌండ్ అండ్ షాట్, గ్రూప్‌ప్లే, ఎస్ ట్రాన్స్‌లేటర్, ఈజీ మోడ్, ఎస్ వాయిస్, ఎస్ బీమ్, ఇన్స్‌స్టెంట్ వాయిస్ రికార్డర్, వాయిస్ గైడెన్స్, డీప్‌ బ్లూ ఇంకా పీ‌వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ ఫోన్ ధర అంచనా రూ.16,000.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot