సామ్‌సంగ్ నుంచి కొత్త ఫోన్ రాబోతుందోచ్
సామ్‌సంగ్ మరో సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు మీడియా కధనాల ప్రకారం సామ్ సంగ్, ‘గెలాక్సీ కోర్ ప్రైమ్' (Galaxy Core Prime) పేరుతో ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ను విపణిలోకి తీసుకువచ్చేందకు పూర్తిస్థాయి సన్నద్ధతో ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్ ధర రూ.9,599 వరకు ఉండొచ్చని అంచనా. ముంబయ్‌కు చెందిన మహేష్ టెలికామ్ ఓ సోషల్ నెట్‌వర్కింగ్ అకౌంట్ ద్వారా వెల్లడించిన వివరాల మేరకు గెలాక్సీ కోర్ ప్రైమ్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి..

4.5 అంగుళాల డబ్ల్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు... వై-ఫై, డ్యూయల్ సిమ్, 3జీ ఇంకా 2జీ, బ్లూటూత్, జీపీఎస్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








