హిట్ కొట్టిన నేపధ్యంలో హుషారుగా!

Posted By: Prashanth

హిట్ కొట్టిన నేపధ్యంలో హుషారుగా!

 

గెలాక్సీ ఏస్ సక్సెస్‌తో మంచి ఊపుమీద ఉన్న మెగాబ్రాండ్ సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ డ్యూయోస్ వేరియంట్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ప్రధాన ఆకర్షణగా విడుదలకాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఉత్తమ మొబైలింగ్‌ను అందిచంటంలో ముందుంటుంది. ప్రధానంగా ఈ ఫోన్‌లో పొందుపరిచిన ‘డ్యూయల్ సిమ్ ఆల్వేస్ ఆన్’ అప్లికేషన్ ఫోన్ కాల్స్‌ను ఏ మాత్రం మిస్ కాకుండా చూస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థను మరిం బలోపేతం చేసేందుకు ఈ అంశం తోడ్పడుతుంది. ఇతర ఫీచర్ల విషయానికొస్తే....

* సొగసైన డిజైన్, అల్ట్రామోడ్రన్ అవుట్ లుక్,

* 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే ఉత్తమమైన విజువల్ అనుభూతులకులోను చేస్తుంది.

* 5మెగా పిక్స్లల్ రేర్ కెమెరా మన్నికైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది.

* హెచ్‌ఎస్‌డీపీఏ 7.2 బ్రౌజింగ్ కనెక్టువిటీ సౌలభ్యతతో ఇంటర్నెట్ డేటాను వేగవంతంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు,

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్టీ కంప్యూటింగ్‌కు సహకరిస్తుంది,

* 832 మెగాహెడ్జ్ ప్రాసెసర్ మొబైలింగ్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది.

* కనెక్టువిటీ వ్యవస్థలైన బ్లూటూత్, యూఎస్బీలు డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి.

* మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ సౌలభ్యతతో మెమెరీని 32జీబికి పొడిగించుకోవచ్చు.

* ఆర్‌డిఎస్ సౌలభ్యతతో ఎఫ్ఎమ్ రేడియో,

* నిక్షిప్తం చేసిన 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ 410 గంటల టాక్‌టైమ్‌నిస్తుంది.

గెలాక్సీ ఏస్ డ్యూయోస్ ధర ఇతర వివరాలు త్వరలోనే బహిర్గతమవుతాయి.

సామ్‌సంగ్ గెలక్సీ ఏస్ ప్లస్:

గెలక్సీ సిరీస్ నుంచి 2011లో విడుదలై అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న స్మార్ట్‌ఫోన్ ‘సామ్‌సంగ్ గెలక్సీ ఏస్’కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ‘ఏస్ ప్లస్’ విడుదలైంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘గెలక్సీ ఏస్ ప్లస్’ ఫీచర్లు క్లుప్తంగా ..

* 3.6 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480 పిక్సల్స్),

* 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా (రిసల్యూషన్ 2592×1944పిక్సల్స్),

* 3జీ కనెక్టువిటీ, ఎడ్జ్, వై-ఫై, జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్,

* నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ),

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, స్పీకర్స్, ఆడియో జాక్,

* ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్1 చిప్‌సెట్, సీపీయూ (1జిగాహెడ్జ్),

* గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (అడిర్నో 200),

* 1300 mAh సామర్ధ్యం గల లితియమ్ ఐయాన్ బ్యాటరీ,

* ప్రీలోడెడ్ సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్స్,

* హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టువిటీ,

* ధర రూ.16,290.

భారతీయుల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో ఈ ఫోన్ ముందంజలో ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు మన్నికైన పనితీరును కలిగి ఉంటాయి. ముఖ్యంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో నిత్యం గడిపే వారికి ఈ ఫోన్ మరింత అనువైనది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వెళ్లి ఓ గెలక్సీ ఏస్ ప్లస్‌ను సొంతం చేసుకోండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot