Home
Mobile

ధర రూ.6499 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ Samsung స్మార్ట్‌ఫోన్‌... సేల్‌ పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఇటీవల ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌లో వరుసగా హ్యాండ్‌సెట్‌లను లాంచ్‌ చేస్తోంది. అంటే రూ.10,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో శాంసంగ్‌ గెలాక్సీ A06, గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్‌ లను విడుదల చేసింది. తాజాగా గెలాక్సీ F05 హ్యాండ్‌సెట్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. శాంసంగ్‌ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999 గా ఉంది. శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy F05 Smartphone Sale) 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.7,999 గా ఉంది. ప్రస్తుతం శాంసంగ్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను కేవలం రూ.6499 కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఎన్నిరోజులపాటు ఉంటుందో శాంసంగ్‌ వెల్లడించలేదు.

Samsung Galaxy F05 Smartphone available at huge discount on flipkart specs and features

శాంసంగ్‌ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 60Hz రీఫ్రెష్‌ రేట్‌, 720*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌తో అందుబాటులో ఉంది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా.. ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 5 OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ హీలియో G85 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 4GB ర్యామ్‌ మరియు 64GB స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు 4GB ర్యామ్‌ను అదనంగా పొడిగించుకోవచ్చు. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

నాలుగు సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు :
శాంసంగ్‌ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్‌ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ రెండు OS అప్‌డేట్‌లు మరియు నాలుగు సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు పొందనుందని శాంసంగ్‌ వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్‌ ట్విలైట్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

50MP ప్రధాన కెమెరా :
శాంసంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఈ హ్యాండ్‌సెట్ వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిజైన్‌తో అందుబాటులో ఉంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు.

ఈ శాంసంగ్‌ ఎంట్రీలెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌లెట్‌ లెదర్‌ ఫినిష్‌తో అందుబాటులోకి వచ్చింది. మరియు భద్రత కోసం ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. అయితే అత్యంత తక్కువ ధరలో ఆకట్టుకొనే కలర్‌ వేరియంట్‌లో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F05 Smartphone available at huge discount on flipkart specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X