Home
Mobile

ధర రూ.6299 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌..!

శాంసంగ్ నుంచి గత సంవత్సరం సెప్టెంబర్‌ లో భారత్‌ మార్కెట్‌లోకి గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపు ధరను పొందవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ F05 హ్యాండ్‌సెట్ (Samsung Galaxy F05 Smartphone) 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ను రూ.6,299 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Samsung Galaxy F05 5G Smartphone

గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
గెలాక్సీ F05 హ్యాండ్‌సెట్ 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల (720*1600 పిక్సల్స్‌) HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లెదర్‌ ఫినిష్‌ తో అందుబాటులో ఉంది. ఫలితంగా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 5 OS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ హీలియో G85 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్‌ మరియు 64GB స్టోరేజీతో జతచేసి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ఒకే వేరియంట్‌ తో అందుబాటులో ఉంది. 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ అదనంగా పొడిగించుకొనేందుకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని శాంసంగ్‌ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను అమర్చి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP డెప్త్‌ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

రేపు మరో కొత్త శాంసంగ్‌ ఫోన్‌ :
భారత్‌ మార్కెట్‌లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. 4GB ర్యామ్‌, 6GB ర్యామ్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంటుంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కాల్ క్లారిటీ కోసం వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ రూ.10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌, ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌, ఆఫ్‌లైన్‌ స్టో్ర్స్‌లో అందుబాటులో ఉండనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F05 Smartphone available at Rs6299 in flipkart check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X