ధర రూ.7,999 కే 50MP కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. సేల్ వివరాలు..!
శాంసంగ్ నుంచి తాజాగా కొత్త హ్యాండ్‌సెట్ విడుదల అయింది. ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్‌లో ఈ శాంసంగ్ గెలాక్సీ F05 లాంచ్ (Samsung Galaxy F05 Smartphone Launched) అయింది. గెలాక్సీ M05 లేదా గెలాక్సీ A05 హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ విడుదలైనట్లు తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.7999 గా ఉంది. ఈ ధరలోనే 6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఒకే స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో G85 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజీని కలిగి ఉంటుంది. అదనంగా 4GB వరకు ర్యామ్‌ను పొడిగించవచ్చు.

గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్... మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 5 OS ను కలిగి ఉంటుంది. రెండు OS అప్‌డేట్‌లు మరియు నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని శాంసంగ్ తెలిపింది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా శాంసంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ 8MP కెమెరాను అమర్చారు. వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంది.
5000mAh బ్యాటరీ సామర్థ్యం :
శాంసంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ధర రూ.7,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 20 నుంచి ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ను ట్విలైట్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
శాంసంగ్ ఎంట్రీ లెవల్ మోడళ్లు :
శాంసంగ్ ఇటీవలే గెలాక్సీ A06, గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్ లను విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ హీలియో G85 12nm ప్రాసెసర్ పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్ లైట్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాను కలిగి ఉంది. దీంతో తక్కువ ధరలోనే నాణ్యమైన కెమెరాలు అందించినట్లు అయింది. గెలాక్సీ M05 స్మా్ర్ట్‌ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.7999 గా ఉంది.


Click it and Unblock the Notifications








