Home
Mobile

రూ.8699 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే శాంసంగ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌..!

Samsung Galaxy F06 5G Smartphone : శాంసంగ్‌ ఈ సంవత్సరంలో అనేక సెగ్మెంట్‌లో వివిధ మోడల్స్‌ను విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ ధరలో ఈ సంవత్సరం ఫిబ్రవరి లో శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు 50MP కెమెరా, 5000mAh ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 OS ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

ధర, డిస్కౌంట్‌ వివరాలు :
భారత్‌ మార్కెట్‌లో ఫిబ్రవరిలో శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999 గా ఉంది. అదే 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది.

Samsung galaxy F06 5G smartphone price cut

ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో 4GB ర్యామ్‌ వేరియంట్‌ను కేవలం రూ.8,699 కే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు రూ.2300 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే విధంగా 6GB ర్యామ్‌ ఫోన్‌ను రూ.10199 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.1300 తగ్గింపును పొందవచ్చు.

ఎంట్రీ లెవల్‌లో మంచి 5G ఫోన్‌ కోసం చూసే వారికి ఈ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. మరియు లిట్‌ వైలెట్‌, Bahama బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Samsung galaxy F06 5G smartphone price cut

శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు
గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7.0 ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా అమర్చి ఉంది. దీంతోపాటు ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

ఈ శాంసంగ్‌ ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు Knox Vault, వాయిస్‌ ఫోకస్‌, క్విక్‌ షేర్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. 5G, WiFi 802.11, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.

ప్రముఖ బ్రాండ్స్‌లో రూ.10000 కంటే తక్కువ ధర కలిగిన ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.8699 కే లభించడంతోపాటు ఏకంగా 4 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్‌ OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung galaxy F06 5G smartphone gets rs2300 price drop on flipkart, 50MP camera and 5000mAh battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X