Home
Mobile

రూ.2500 డిస్కౌంట్‌తో 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే శాంసంగ్‌ 5G ఫోన్‌..!

Samsung Galaxy F06 5G Smartphone : శాంసంగ్‌ నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. రూ.10 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. రూ.10 వేల కంటే తక్కువ ధరలో 5G ఫోన్ కావాలనే వారికి ఈ హ్యాండ్‌సెట్ బెస్ట్‌ ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999 గా ఉంది. 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F06 5G Smartphone

రూ.2500 తగ్గింపు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.8499 గా ఉంది. అంటే సుమారు రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.9499 గా ఉంది. అంటే సుమారుగా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు ;
శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిజైన్ పరంగానూ ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ లిట్‌ వైలెట్‌, బహమా బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7.0 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తోపాటు 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తుందని శాంసంగ్ తెలిపింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ గెలాక్సీ F06 5G హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను అమర్చారు. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 8MP కెమెరాను అమర్చారు.

రూ.10 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా కూడా ఈ ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు ఈ ఫోన్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ సెక్యూరిటీ కోసం Knox Vault ఫీచర్‌తోపాటు క్విక్‌ షేర్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. కాల్‌ క్వాలిటీ కోసం వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. కనెక్టివిటీ పరంగా 5G, WiFi 802.11, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F06 5G Smartphone gets rs2500 discount on flipkart here are the features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X