Home
Mobile

రూ.10,000 ధరలో 50MP కెమెరా, 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే, వాయిస్‌ ఫోకస్‌తో శాంసంగ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

శాంసంగ్‌ తాజాగా ఎంట్రీ లెవల్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. డిజైన్‌ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు కెమెరా మాడ్యూల్‌ ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా సహా 6.7 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. రూ.10,000 ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ కోసం ఎదురుచూసే వారికి ఈ హ్యాండ్‌సెట్ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. 2024 సెప్టెంబర్‌ నెలలో గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన శాంసంగ్‌.. కేవలం 5 నెలల వ్యవధిలోనే గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy F06 5G Smartphone) 6.7 అంగుళాల HD+ రిజల్యూషన్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఫ్లక్స్‌ లెదర్ ఫినిష్‌ పాలీకార్బోనేట్‌తో కూడిన గ్లోసీ బ్యాక్‌ ప్యానల్‌ను కలిగి ఉంది.

Samsung Galaxy F06 5G sale date

చిప్‌సెట్‌, OS వివరాలు :
ఈ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత (అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌) One UI 7.0 పైన పనిచేస్తుంది.

స్టోరేజీ వేరియంట్‌లు :
ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు. మరియు ఈ హ్యాండ్‌సెట్ రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో భారత్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Samsung Galaxy F06 5G sale date

డ్యూయల్‌ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కాల్‌ క్లారిటీ కోసం కొత్త ఫీచర్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ శాంసంగ్‌ Knox Vault, కాల్‌ క్వాలిటీ కోసం వాయిస్‌ పోకస్‌ మరియు క్విక్‌ షేర్‌ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. దీంతోపాటు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 12 5G బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుందని శాంసంగ్‌ తెలిపింది.

గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.500 తగ్గింపును పొందే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ (Galaxy F06 5G Sale Date) సేల్‌ ఈ నెల 20 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ బహమా బ్లూ, లిట్‌ వైలెట్‌ వంటి రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్‌ డ్యూయల్‌ సిమ్‌ కార్డులను సపోర్టు చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F06 5G Smartphone launched with 50MP Camera and voice focus feature in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X